1. ముగిసిన అఖిలప్రియ కస్టడీ
ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. రేపు మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జనగామ ఘటనపై విచారణ
జనగామ లాఠీఛార్జీ ఘటనపై డీసీపీతో విచారణకు వరంగల్ సీపీ ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం భాజపా శ్రేణులపై లాఠీఛార్జీకి దారితీసిన ఘటనపై విచారణకు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రధాన సూత్రదారి అరెస్ట్
రుణ యాప్‌ల కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి కేంద్రంగా రుణ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పట్టు వస్త్రాల సమర్పణ
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదా కల్యాణం ఘనంగా జరిపారు. ఈ కల్యాణ మహోత్సవంలో మంత్రి ఈటల పాల్గొని... స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఛాయ్‌వాలా కన్నుమూత
పద్మశ్రీ గ్రహీత ప్రకాశ్ రావు కన్నుమూశారు. ఒడిశాలోని కటక్‌కు చెందిన ఆయన.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఫైటర్ జెట్ల తయారీకి భారత్ సిద్ధం
భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48,000 కోట్లతో తేజస్ ఫైటర్ జెట్లు సమకూర్చాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ట్రంప్ గట్టెక్కుతారా?
అమెరికా ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన అస్త్రాన్ని డెమొక్రాట్లు బుధవారం ప్రయోగించే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 500 మిలియన్ డౌన్లోడ్లు
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ నిబంధనల ప్రభావంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' డౌన్లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ఉప్పెన' టీజర్
రొమాంటిక్ డ్రామా 'ఉప్పెన' టీజర్.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విరుష్క విన్నపం
తమ పాప ఫొటోలను తీయొద్దని విరాట్-అనుష్క దంపతులు కోరారు. ఈ మేరకు చిన్నారి గోప్యతకు భంగం కలిగించొద్దని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.