ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@3PM
టాప్​టెన్ న్యూస్@3PM
author img

By

Published : Mar 13, 2021, 2:59 PM IST

1. శతాబ్దిలో చెలరేగిన మంటలు

దిల్లీ నుంచి దేహ్రదూన్​ వెళ్తున్న శతాబ్ది ఎక్స్​ప్రెస్​లో అగ్నిప్రమాదం సంభవించింది. హరిద్వార్​లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం ఆవరణలోని కాంసారో స్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. థాంక్యూ సంతన్న

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరిస్తూ... తన పుట్టినరోజున మొక్కలు నాటారు. అమ్మతో కలిసి మొక్కలు నాటటం ఆనందంగా ఉందన్న కవిత... మంచి బహుమతి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. దిశా నిర్దేశం

సోమవారం నుంచి బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఖర్చులకు పైసలిస్తాం

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు... నోరు జారుతున్నారు. గుట్టుగా చేసే పనులను బహిరంగంగా ప్రస్తావిస్తూ టాక్​ ఆఫ్​ ది టౌన్​గా నిలుస్తున్నారు. తాజాగా... "ఓటేస్తే ఖర్చులకు పైసలిస్తాం" అని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ చేసిన వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. స్తంభమెక్కి హల్​చల్

రోజూ పని చేస్తున్నా.. కూలీ డబ్బులు రావడం లేదు. పైసలు లేక తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. మద్యం సేవించి విద్యుత్​ స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. రాత్రిపూట కర్ఫ్యూ!

కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో భోపాల్​, ఇండోర్​ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉన్నట్లు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. తృణమూల్​లోకి కేంద్ర మాజీ మంత్రి

కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ​ నేత యశ్వంత్​ సిన్హా.. తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)లో చేరారు. కోల్​కతాలోని టీఎంసీ భవన్​లో ఆ పార్టీ‌ కండువా కప్పుకున్నారు. గతంలో భాజపా హయాంలో కేంద్ర మంత్రిగా రెండు సార్లు సేవలందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. పెట్టుబడులు పెట్టవచ్చా?

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కంటే ముందున్న స్థాయిని దాదాపు చేరుకుంది ప్రస్తుతం.. పసిడి ధర. అయితే.. ఇంకా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది? ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఎలా పిలిచినా పలుకుతా

కొన్నేళ్ల తర్వాత బుల్లితెరపై మరోసారి సందడి చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన వ్యాఖ్యాతగా ఓ ప్రముఖ ఛానెల్​లో ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్ ప్రోమో నేడు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. తొలి టీ20కి 67వేల మంది

ఇంగ్లాండ్​తో భారత్​ తొలి టీ20కి 67వేల పైచిలుకు ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ విషయాన్ని ఓ క్రీడా వార్త సంస్థ ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. ఇంత మంది స్టేడియానికి రావడంపై పాకిస్థాన్​ క్రికెటర్ ఆమిర్ యామిన్​ స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.