1. భాజపా అభ్యర్థుల ప్రకటన
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు, వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. షెడ్యూల్ విడుదల
ఏపీలో మరో ఎన్నికలకు... ఎస్ఈసీ శంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రైతులకు స్వేచ్ఛ
లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మరింత శ్రమించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ భాజపా సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. విచారణకు సహకరిస్తా
కిడ్నాప్ కేసులో బోయిన్పల్లి పీఎస్‌కు భూమా అఖిలప్రియ హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో పోలీసులకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. యాదాద్రి పుష్కరిణులు
యాదాద్రీశుని ఆలయ సన్నిధిలో ఉన్న విష్ణు పుష్కరిణిని రూ.4.01 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. దైవ కార్యక్రమాల కోసం ఈ పుష్కరిణిని వినియోగించనున్నారు. కొండకింద భక్త జనుల పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా లక్ష్మీ పుష్కరిణి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వేచి ఉండండి
జేఈఈ అడ్వాన్స్- 2020 రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని పులువురు ఆశావహులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని యూపీఎస్సీ అంశం తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అంతరిక్షంలోకి మోదీ
50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇస్రో.. ఫిబ్రవరి 28న దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులో భాగంగా ఓ శాటిలైట్‌లో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం, భగవద్గీత కాపీ, 25వేల మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో.. అంతకు ముందు నెలతో పోలిస్తే 0.81 శాతం పెరిగింది. 2020 డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 1.22 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సపోర్ట్ చేశారు
తన పెళ్లి, కుటుంబం, పిల్లలు కోసం చెప్పిన గాయని సునీత.. రామ్‌తో వైవాహిక బంధం గురించి తెలిపారు. ఈ విషయంలో తన పిల్లలు పరిస్థితి అర్థం చేసుకుని సపోర్ట్ చేశారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఐపీఎల్ 14కు ప్రేక్షకులు
2021 ఏప్రిల్‌లో జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు అభిమానులను తప్పనిసరిగా అనుమతిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 18న వేలం అనంతరం లీగ్ తేదీలు, వేదికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.