1. కొత్తగా 238 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా 238 కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ యార్డులో విద్యుత్ నియంత్రిక మరమ్మతు చేసి... కూలింగ్ ఉంచే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 10 వేలకు బదులు 4 వేలే
ఓ ఏటీఎంలో రూ.10 వేలు నమోదు చేస్తే రూ.4 వేలు, రూ.5 వేలకు రూ.2 వేలు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కయిన ఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తాడిపత్రిలో ఉద్రిక్తత
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పోలీసులు జేసీ సోదరులను గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పెళ్లిలో వరుడు మాయం
తెల్లారితే పెళ్లి... అప్పటివరకు విందులో కలియతిరిగాడు పెళ్లికొడుకు నవీన్. అంతే.. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. పొద్దునే వివాహం అని ఎదురుచూస్తున్న పెళ్లికూతురుని మనువాడేందుకు మరో నవవరుడు ముందుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కొత్తగా 16,505 కేసులు
దేశవ్యాప్తంగా కొత్తగా 16,505 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరో 214 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 19 వేల మందికిపైగా మహమ్మారిని జయించగా.. రికవరీ రేటు 96.16శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. సైబర్ వలలో కశ్మీరీ యువత!
కశ్మీరీ యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు.. పాకిస్థానీ ముష్కర సంస్థలు విభిన్న ఎత్తుగడలు పన్నుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి స్థానికులను ఉగ్రవాద సంస్థల్లో నియమిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చర్చిలో కాల్పులు
అమెరికాలోని ఈస్ట్ టెక్సాస్‌లో ఓ చర్చి పాస్టర్ హత్యకు గురైయ్యారు. ముందుగానే చర్చిలో దాక్కున్న నిందితుడు.. తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. అక్షయ్ స్పీడ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అతడి ఏడు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. అవన్నీ వేటికవే భిన్నమైన నేపథ్య కథలతో తెకెక్కుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అందరికీ నెగిటివ్
మూడో టెస్టుకు ముందు ఆదివారం చేసిన వైద్య పరీక్షల్లో ఇరుజట్ల ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలింది. దీంతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానంలో దిగడం దాదాపు ఖరారైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.