ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
టాప్​న్యూస్ @5PM
author img

By

Published : Jan 3, 2023, 4:59 PM IST

  • పాలమూరు-రంగారెడ్డి NGT తీర్పుపై SLP వేయాలని నిర్ణయించాం: రజత్​కుమార్

గోదావరిలో మిగుల జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదించాలని గోదావరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాధాన్యంలో ఐదు అంతర్ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తీర్మానించారు.

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి.. వైద్యులకు హరీశ్‌రావు ఆదేశం

ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే డాక్టర్లు, గర్భిణీలు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో 30 పడకల ప్రభుత్వం ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పలు రకాలు సూచనలు చేశారు.

  • ఎన్పీడీసీఎల్​లో ఉద్యోగాలంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సీఎండీ

ఎన్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్​ అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై సీఎండీ గోపాల్​రావు స్పందించారు. ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. సంస్థకు సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ల లాంటి సమాచారం అయిన అధికారిక వెబ్​సైట్లలో చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • 27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన.. చర్చలతో ధర్నాకు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్​ నగరంలోని మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలిపారు. గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మెట్రో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • 20ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన జవాన్​.. గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పిన గ్రామస్థులు

అర్మీ జవానుకు అపురూప గౌరవం దక్కింది. చిన్న వయసులోనే ఆర్మీకి ఎంపికై ఓ జవాను 20సంవత్సరాల తరువాత స్వగ్రామానికి రావడంతో... గ్రామస్థులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈ వేడుకను జాతర మాదిరి చేసుకున్నారు. బాజా, భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో జవానుకు ఘన స్వాగతం పలికారు.

  • అంబానీ, అదానీ.. రాహుల్​ను కొనలేరు... ఆయనొక యోధుడు: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అదానీ, అంబానీ కొనుగోలు చేయలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కేంద్రం ప్రయత్నించినా ఆయన భయపడరని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర దిల్లీ నుంచి మంగళవారం ఉత్తర్​ప్రదేశ్​లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రియాంక.

  • వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారని కోపం.. అడ్మిన్​ను చితకబాది, నాలుక కోసేసి..

ఎవరైనా వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగిస్తే మళ్లీ చేర్చమని అడుగుతారు. కానీ ఏకంగా అడ్మిన్​ను చితకబాది, నాలుక కోసేశారు ఐదుగురు వ్యక్తులు. మహారాష్ట్ర పుణెలో జరిగిందీ ఘటన.

  • పెరిగిన డిపాజిట్ రేట్లు.. పొదుపు పథకాల్లో ఏది బెటర్?

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!

  • జట్టులోకి బుమ్రా.. రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్​ కాదంటున్న హార్దిక్​!

ఆసియా కప్‌ సమయంలో లంకేయుల చేతిలో ఎదుర్కొన్న ఓటమికి.. తాజా సిరీస్​లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో మ్యాచ్​ గురించి మాట్లాడాడు కెప్టెన్​ హార్దిక్​. మరోవైపు ఈ సిరీస్​ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ గుడ్​న్యూస్ చెప్పింది. జట్టులోకి బుమ్రా వస్తున్నాడని తెలిపింది.

  • ఆ సినిమా కోసం రాజశేఖర్‌ను రికమెండ్‌ చేసిన చిరంజీవి

తాను నటించాలనుకున్న ఓ చిత్రానికి హీరోగా రాజశేఖర్‌ను సూచించారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.