ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్@ 9AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : Jan 2, 2023, 8:58 AM IST

  • కాసులు కురిపిస్తోన్న స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ.. 9 నెలల్లోనే ఏకంగా..!

రాష్ట్రంలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గడిచిన తొమ్మిది నెలల్లో 14.54 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,583 కోట్లు రాబడి ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,944 కోట్లు రాబడి రాగా.. రూ.1,587 కోట్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది.

  • 2022లో మనోళ్లు తెగ తాగేశారు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

రాష్ట్రంలో 2022 ఏడాదిలో భారీగా మద్యం అమ్ముడైంది. రూ. 34,353 కోట్లు విలువైన లిక్కర్‌, బీర్లను మద్యం ప్రియులు తాగేశారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,890 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. లిక్కర్‌ కంటే ఎక్కువగా బీర్లు అమ్ముడుపోయాయి.

  • ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్.. చివరిరోజు తరలివచ్చిన పుస్తకప్రియులు

ళాభారతిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ అట్టహాసంగా జరిగింది. 11 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన ఆఖరి రోజున నగరవాసులు పుస్తకాలు కొనేందుకు తరలివచ్చారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రాంగణమంతా సందడిగా మారింది.

  • తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

  • ఉగ్రవాదుల లక్షిత దాడి.. నలుగురు మృతి.. ఆరుగురికి గాయాలు

కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలో ఇళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు.

  • మైనర్ కుమార్తెపై పెద్దనాన్న అత్యాచారం.. పోలీసుల భయంతో పరార్​!

మైనర్​ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మర్మాంగాల్లో నొప్పి భరించలేక బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

  • 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్‌.. రిపబ్లికన్ల మద్దతు లేకున్నా ముందుకే..

అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్లు వ్యతిరేకించినా ఈ విషయంలో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. తృతీయపక్ష అభ్యర్థిగానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు.

  • లక్షలాది బిర్యానీలతో 2023కి టేస్టీ వెల్​కమ్​.. బావర్చీలో నిమిషానికి రెండు.. స్విగ్గీ రికార్డ్!

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీ బిర్యానీకే అత్యధిక కస్టమర్లు మొగ్గు చూపినట్లు పేర్కొంది.

  • IPLకు పంత్‌ దూరం!.. దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌?

టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం చికిత్ప పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి ఆరు నెలలు సమయం పట్టే అవకాశముంది. దీంతో వచ్చే సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • మాస్‌ మొగుడు వీరసింహారెడ్డి ట్రైలర్ డేట్ ఫిక్స్.. స్టైలిష్​ లుక్​లో అమిగోస్‌

బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా చిత్ర బృందం ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నారు. మరోవైపు, కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మూవీ 'అమిగోస్‌' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.