ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News  today
Telangana Top News today
author img

By

Published : Jan 1, 2023, 6:58 PM IST

  • 'నుమాయిష్' ప్రారంభం..

నూతన సంవత్సరం ప్రారంభం వేళ హైదరాబాద్‌ వాసులను అలరించేందుకు నుమాయిష్‌ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ఈ నుమాయిష్​ను ప్రారంభించారు. నేటి నుంచి నెలన్నర పాటు ఈ ఎగ్జిబిషన్​ నిర్వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2,000పైగా స్టాళ్లు నుమాయిష్‌లో కొలువుదీరాయి.

  • భారీగా మద్యం విక్రయాలు

రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 11వందల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. డిసెంబర్‌ నెలలో ఏకంగా రూ.3,376 కోట్లు విలువైన మద్యాన్ని మద్యం ప్రియులు తాగేశారు.

  • 'ఆర్టీసీ బస్సులో మనకు ఎన్నో అనుభవాలుంటాయి.. దురదృష్టవశాత్తు'

2022 ఏడాది టీఎస్​ ఆ​ర్టీసీకి ఎంతో కలిసొచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మహాత్మా గాంధీ బస్​ స్టేషన్​లో ప్రయాణికులతో కలిసి కేక్​ కట్​ చేశారు. ప్రయాణికులతో ముచ్చటించి సౌకర్యాలపై ఆరా తీశారు.

  • మరో వ్యక్తి అరెస్టు

సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, పోస్ట్‌లు పెట్టిన కరీంనగర్‌ జిల్లా వాసి బైరి అగ్నితేజ్‌ను కమలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

  • బీఆర్‌ఎస్‌లోకి ఏపీ మాజీ ఐఏఎస్‌ అధికారి

ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు​..

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది.

  • కారు, ఆటో ఢీ.. నలుగురు యువకులు మృతి.. 8 మందికి గాయాలు

పంజాబ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందగా.. మరికొంత మందికి గాయపడ్డారు. శనివారం రాత్రి అమృత్​సర్​లో జరిగిందీ ఘటన. స్థానికుడు దల్జీత్​ సింగ్​ తెలిపిన వివరాల ప్రకారం.. అట్టారీ రోడ్డులోని ఘరీందర్​ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది యువకులు ఉన్నారు.

  • 'పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​కు సన్మానం'

క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. మరోవైపు, వీఐపీలు పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని డీడీసీఏ అభ్యర్థించింది.

  • దుమ్మురేపిన 'ఖుషి'​ వసూళ్లు..

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ నటించిన 'ఖుషి' రీరిలీజ్​ రికార్డులు బద్దలుగొడుతోంది. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లైనా పవర్ ఏ​మాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఖుషి' రీరిలీజ్​ కలెక్షన్లు ఎంతంటే?

  • అక్కినేని హీరోల నయా అప్డేట్స్.. యాక్షన్ మోడ్​లో చై..

అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్​ ఇస్తూ ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు అక్కినేని హీరోలు. నాగచైతన్య నటిస్తున్న 'కస్టడీ' మూవీ గ్లింప్స్​, అఖిల్​ 'ఏజెంట్'​ సినిమా మేకింగ్​ వీడియోను ఆయా చిత్రాల మేకర్స్ విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.