ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
టాప్​న్యూస్ @1PM
author img

By

Published : Jan 1, 2023, 1:00 PM IST

  • పోలీస్ నియామక తుది పరీక్షల తేదీలు ఖరారు

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను నియామక మండలి ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23 వరకు వివిధ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్సై నియామక పరీక్షలు, ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని జాబితా విడుదల చేసింది.

  • ఆర్నెల్లలో యాదాద్రీశుల దివ్యవిమానం స్వర్ణమయం!

పునర్నిర్మితమైన పంచనారసింహుల ఆలయాన్ని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా స్వర్ణవిమానం రూపకల్పనకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మహాదివ్యంగా రూపొందించే యోచనతో కృష్ణశిలతో నిర్మించిన విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు భక్తులంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్​ ఇచ్చిన పిలుపుమేరకు ఇప్పటి వరకు రూ.33 కోట్లు, 8 కిలోల బంగారం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

  • చివరి త్రైమాసికంలో రూ.6 వేల కోట్లకుపైగా రుణం తీసుకోనున్న సర్కార్

చివరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లకు పైగా రుణం తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుగా తీసుకొంది.

  • రామగుండం NTPC ప్లాంటులో విద్యుదుత్పత్తికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు.. నేడో, రెేపో..!

రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన కొత్త విద్యుత్‌ కేంద్రం మొదటి ప్లాంట్​లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్లను నిర్మించింది. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్‌ రూ.5కే లభిస్తుంది.

  • శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభం

శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల కోసం తిరుమల భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులతో రద్దీ నెలకొంది. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు 45 వేల టోకెన్ల చొప్పున 10 రోజులకు నాలుగున్నర లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

  • పట్టపగలే మహిళను కిడ్నాప్ చేసేందుకు​ యత్నం.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..

జిమ్​ నుంచి తిరిగి వస్తున్న ఓ మహిళను కిడ్నాప్​ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ఆ మహిళ కారులో నలుగురు వ్యక్తులు బలవంతంగా ఎక్కారు. మహిళ ప్రతిఘటించడం వల్ల నిందితులు పారిపోయారు. ఈ ఘటన హరియాణాలోని యమునా నగర్​ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • క్షిపణి పరీక్షతో కిమ్ న్యూఇయర్ వేడుక... ఈ ఏడాది మరింత దూకుడు!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠం చేస్తామని ప్రకటించారు.

  • వంట గ్యాస్ ధర పెంపు.. సిలిండర్​కు ఎంతంటే..

వంట గ్యాస్​ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769కి చేరింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్​ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

  • బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరం.. వికెట్ కీపర్​గా వారిద్దరికీ ఛాన్స్!

పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్‌ కమిటీకి సవాలుగా మారింది. దీంతో అతన్ని రిప్లేస్​ చేసే వ్యక్తి కోసం కమిటీ సన్నాహాలు చేస్తోంది.

  • త్వరలో సెట్స్​పైకి కొరటాల-ఎన్టీఆర్​ మూవీ.. రిలీజ్​ డేట్ ఫిక్స్.. పోస్టర్ ఊరమాస్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొరటాల- ఎన్టీఆర్​ కాంబోపై అప్డేట్ రానే వచ్చింది. మూవీ రిలీజ్ డేట్​ను అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నయా పోస్టర్​ ద్వారా తెలిపింది మూవీ టీమ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.