ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 13, 2022, 4:58 PM IST

  • దిల్లీలో బీఆర్ఎస్‌ కార్యాలయం పనులను పరిశీలించిన కేసీఆర్‌

దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. కార్యాలయంలో పనులు పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలు సంద‌ర్శించారు.

  • బీఆర్​ఎస్​తో కొత్త చరిత్ర.. బీజేపీ బ్రెయిన్‌ డ్యామేజ్‌ చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

‘‘భారత్‌ రాష్ట్ర సమితి" ప్రకటనతో బీజేపీ బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో భారత్‌ రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్న ఆమె.... రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన కవిత... బతుకమ్మను, మహిళలను బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారని ఆరోపించారు.

  • వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల వేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్రల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది.

  • పరిచయం.. ప్రేమ.. కిడ్నాప్​.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

మన్నెగూడ యువతి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న నవీన్‌రెడ్డి యువతిని అపహరించి వివాహం చేసుకోవాలనుకున్నాడని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.

  • తస్మాత్ జాగ్రత్త.. ఓడీ విషయంలో ఆంధ్రప్రదేశ్​ను హెచ్చరించిన ఆర్‌బీఐ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ కల్పించే అన్ని రకాల ఆర్థిక వెసులుబాట్లను రాష్ట్రం ఇప్పటికే వినియోగించేసుకుంది. లెక్కకు మించిన అప్పులు చేయడంతో సెక్యూరిటీ వేలంలోనూ పాల్గొనలేని పరిస్థితి. మొన్నటి వరకు అప్పు చేసి రోజులు నెట్టుకొచ్చారు.

  • పుట్టినరోజునే శరద్ పవార్​కు బెదిరింపు ఫోన్​ కాల్స్.. నిందితుడు అరెస్ట్

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్​ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. ఆయన్ను హత్య చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం శరద్ పవార్ పుట్టినరోజు కాగా.. అదేరోజు ఈ బెదిరింపు కాల్​ రావడం కలకలం రేపింది.

  • ఆత్మహత్యకు ప్రేమజంట ప్లాన్.. ఉరేసుకున్న ప్రియుడు.. భయంతో యువతి వెనకడుగు

ఎవరైనా ప్రేమికులు పెళ్లిచేసుకుని కలిసి జీవించాలనుకుంటారు. కానీ కేరళకు చెందిన ప్రేమికులు మాత్రం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాక ఆత్మహత్య చేసుకుందామని ఓ ఒప్పందానికి సైతం వచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ యువకుడు ఉరేసుకోగా.. యువతి మాత్రం భయపడి వెనక్కి తగ్గింది.

  • పీపీఎఫ్‌ పథకం కింద రుణం ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?

అధిక వడ్డీతో పాటు ప్రభుత్వ హామీతో కూడిన పన్ను రహిత రాబడినిచ్చే పథకాలలో పీపీఎఫ్‌ అన్ని పొదుపు పథకాల కంటే ముందు ఉంటుంది. అయితే ఈ పొదుపు పథకం కింద రుణం ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?

  • గాయపడ్డ కెప్టెన్​​.. ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలింపు​

టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​కు ​ముందు బంగ్లాదేశ్​ కెప్టెన్​ గాయపడ్డాడు. అతడిని ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లంక ప్రీమియర్​ లీగ్​లో యంగ్ ప్లేయర్​ ఆజాం ఖాన్​ తీవ్రంగా గాయపడ్డాడు.

  • అవకాశం వస్తే.. పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటిస్తా: స్టార్‌ హీరో

అవకాశం వస్తే పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​. ఇంకా ఏమన్నారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.