ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS
author img

By

Published : Dec 12, 2022, 8:57 AM IST

  • దారుణం.. గొంతు, నరాలు కోసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చంపేశారు!

అప్పు ఇచ్చిన వ్యక్తి... ఆ డబ్బు తిరిగి అడుగుతున్నాడనే కక్షతో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ను పాశవికంగా హత్య చేశారు. డబ్బులు ఇస్తామని నమ్మబలికిన నిందితులు పథకం ప్రకారం.. స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి గొంతు, చేతిమణికట్లు, కాలి చీలమండల నరాలు కోసి అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో కలకలం రేపింది.

  • మాదకద్రవ్యాల సరఫరా కేసు.. ఎడ్విన్‌ న్యూన్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు పీడీయాక్ట్

గోవా కేంద్రంగా మాదకద్రవ్యాలు రవాణా చేసే ఎడ్విన్‌ న్యూన్స్‌ పై... హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. మత్తు పదార్ధాల సరఫరాలో ఎడ్విన్‌పై ఓయూ, రాంగోపాల్‌పేట్‌, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లలో మూడుకేసులు నమోదయ్యాయి. గోవాలో పాగా వేసిన అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.

  • ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్​కు చెక్!

మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తొలగించేందుకు కొన్ని ఆహారపదార్థాలను తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటో మీరే చూడండి.

  • ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు చివరకు జాక్​పాట్

ప్రేయసిని కలిసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి యువతి కుటుంబ సభ్యులకు అడ్డంగా బుక్కయ్యాడు. బిహార్​లోని ఛప్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గడ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీరాజ్​పుర్​లో ఉండే మున్నా రాజ్ అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి తన గర్ల్​ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు.

  • పదునైన తీర్పు... ప్రబల సంకేతాలు.. పార్టీలు ఆత్మపరిశీలన చేసుకుంటేనే..

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు, దిల్లీ నగరపాలక సంస్థ పోరులో ప్రజా తీర్పు అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా తమ పనితీరుపై అన్ని పక్షాలు మదింపు వేసుకోవాలి. సరైన అడుగులు వేస్తే ప్రతీ పక్షమూ తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది.

  • నిద్రలోనే భార్యాభర్తల దారుణ హత్య.. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో..

ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతోనే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • ఆ దేశంలో అందరి వయసూ రెండేళ్లు తగ్గుతుందట... అదెలాగంటే?

దక్షిణ కొరియన్ల వయసు ఒకట్రెండేళ్లు తగ్గనుంది. వయసు తగ్గడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ!! ఆ దేశం తీసుకురానున్న చట్టం ప్రకారం జనాభా మొత్తం వయసు ఒకటి, రెండేళ్లు తగ్గిపోనుంది. అదెలా అంటే?

  • ఈ వారం 3 ఐపీఓల సందడి.. ఆ కంపెనీలో ఒక్కో షేరుకు 9 బోనస్ షేర్లు

స్టాక్ మార్కెట్​లో ఈ వారం మూడు ఐపీఓలు సందడి చేయనున్నాయి. రూ.1858 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇవి ఐపీఓకు వస్తున్నాయి. అవేంటంటే?

అమ్మాయిలు అదుర్స్.. ఆస్ట్రేలియాపై 'సూపర్' విక్టరీ.. అదరగొట్టిన స్మృతి, రిచా

భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్‌ ఓవర్లో ఓడించింది. మహిళల క్రికెట్లో ఓ సూపర్‌ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్‌.. వెస్టిండీస్‌ (18)ను వెనక్కినెట్టి రికార్డు సృష్టించింది.

  • 'సుగుణ సుందరి'తో బాలయ్య సందడి.. రవితేజ ట్రైలర్ 'ధమాకా'!

బాలయ్య హీరోగా నటిస్తున్న 'వీరసింహారెడ్డి' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ఈ సినిమాలోని "సుగుణ సుందరి" అనే పాట విడుదల చేయనున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన 'ధమాకా' సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.