ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news
author img

By

Published : Nov 24, 2022, 8:58 PM IST

  • డిసెంబర్‌లో శాసనసభ సమావేశాలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... అందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు.

  • హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, మద్రాస్​ హైకోర్టులో పనిచేస్తోన్న జడ్జిలను వివిధ హైకోర్టులకు బదిలీ చేయడానికి కొలీజియం సిఫారసు చేసింది.

  • మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాల్లో రూ.15 కోట్లు స్వాధీనం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన... మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై.. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు.. ముగిశాయి. పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్న ఐటీ బృందాలు... మంత్రి సహా ఆయన బంధువులకు సమన్లు జారీ చేశారు. ఈ నెల28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ వర్గాలు ఆదేశించాయి.

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ వేగవంతం చేసిన సిట్‌..

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ జోరు పెంచింది. ఇప్పటికే కేరళ, హరియాణాలో సోదాలు చేసిన అధికారులు... కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 29న విచారణకు రావాలని వైకాపా ఎంపీకి సిట్‌ తాఖీదులు ఇచ్చింది. నోటీసులను సవాలు చేస్తూ పిటిషన్‌ వేసిన న్యాయవాది ప్రతాప్‌నకు... హైకోర్టులో ఊరట లభించింది.

  • దిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్‌ బోయిన్‌పల్లికి జ్యుడీషియల్‌ రిమాండ్‌

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ సంయుక్త దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అభిషేక్, విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లు తీహాడ్ జైలులో ఉన్నారు. ఇవాళ వీరి బెయిల్‌ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది.

  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈనెల 29న హాజరు కావాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.

  • ఉచిత కరెంట్​ కాదు.. విద్యుత్​తో ఎలా సంపాదించాలో నేర్పిస్తా: మోదీ

గుజరాత్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ. ఉచిత కరెంట్​​ ఇవ్వడానికి బదులు.. విద్యుత్​తోనే ప్రజలు సంపాదించుకునేలా చేస్తాన్నన్నారు. ఆప్​ కేవలం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తోందని మండిపడ్డారు.

  • చైనాలో కరోనా ఉగ్రరూపం..

చైనాను కరోనా వైరస్​ హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

  • ఇక వన్డే సమరం.. సంజూ ఈ సారి డౌటే..

న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ కోసం సిద్ధమైంది. నవంబరు 25 నుంచి ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు తెలుసుకుందాం..

  • సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత తొలిసారిగా మహేశ్​ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో తన తండ్రిని గుర్తుచేసుకుంటూ హీరో మహేశ్ బాబు ఓ ఎమోషనల్​ లెటర్ రాశారు. దానిని సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. "మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.