ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - Telangana news in telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ @9AM
టాప్​న్యూస్ @9AM
author img

By

Published : Oct 28, 2022, 9:00 AM IST

  • భాజపాపై కేసీఆర్ టార్గెట్.. నేడో రేపే దిల్లీకి పయనం!

TRS MLAS trap issue: ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాల అంశంపై దిల్లీ వేదికగా భాజపాపై విరుచుకు పడేందుకు సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్​ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భాజపా జాతీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దూకుడు పెంచేలా వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. గంటల కొద్ది వీడియో, ఆడియో రికార్డింగులను స్వయంగా వింటున్న కేసీఆర్​.. పూర్తి ఆధారాలతో ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల విచారణలో పోలీసులు కీలక ఫోన్ సంభాషణలను సేకరించినట్లు సమాచారం.

  • 'ఎమ్మెల్యేలకు ఎర' వ్యవహారం.. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

KCR is silent about the purchase of TRS MLAs: దేశవ్యాప్తంగా సంచనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. ఇప్పుడు అందరి దృష్టిని తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా ఉంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలకు ఎర అంశం పై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ అంశాన్ని జాతీయస్థాయిలో లెవనెత్తే అవకాశం ఉంది.

  • Munugode Bypoll: హైదరాబాద్​లో మునుగోడు భవితవ్యం... ఆ ఓటర్లే కీలకం!

Munugode election:మునుగోడు భవితవ్యం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓటర్లపై ఆధారపడనుంది. గెలుపు, ఓటముల్లో ఈ ఓట్లే కీలకంకానున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 25 వేలకుపైగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వారిపై దృష్టిసారించాయి.

  • కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్‌ భేష్‌.. ఐరాస నివేదిక

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ధనిక దేశాలు చెబుతున్న మాటలకు వాటి ఆచరణకు ఏ మాత్రం పొంతనలేదని మరోసారి రుజువైంది. కర్బన ఉద్గారాల విడుదల ధనిక దేశాల్లోనే అధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక నివేదిక స్పష్టం చేసింది. జీ20 దేశాల సగటులోనూ భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొంది.

  • ఎలాన్​ మస్క్​ చేతికి 'ట్విట్టర్​'.. సీఈవో పరాగ్ అగర్వాల్​​ తొలగింపు

Elon Musk Twitter: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​.. సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ను ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నారు. 44 కోట్ల డాలర్లకు ట్విట్టర్‌ను దక్కించుకున్నారు. ట్విట్టర్​ను దక్కించుకున్న వెంటనే ప్రస్తుత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో, పలు విభాగాల అధిపతులను మస్క్‌ తొలగించారు.

  • ఇంటి పని చేయాలని భార్యకు చెప్పడం క్రూరత్వం కాదు: హైకోర్టు

ఇంటి పనులు చేయాలని వివాహితకు అత్తింటివారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పనిమనిషిలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఓ మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • మీ చర్మం పొడిబారుతుందా?.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు!

Skin Care In Winter : శీతాకాలంలో చాలామందిలో చర్మం, పెదాలు పొడిబారడమే కాకుండా మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులు చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మరి, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించమంటున్నారు సౌందర్య నిపుణులు.

  • 'టీమ్‌ఇండియాలో రోహిత్‌, కోహ్లీ కన్నా అతడు చాలా డేంజర్​'

ప్రపంచ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ భారత్‌ జోరు కొనసాగించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టును సునాయాసంగా చిత్తు చేసి మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా యువ సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌పై నెదర్లాండ్స్‌ పేసర్‌ పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల కన్నా జట్టులో సూర్య ప్రమాదకర ఆటగాడని, అతడితో ఆడేటప్పుడు తానెంతో ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు.

  • 'వీరసింహారెడ్డి'గా బాలయ్య భారీ పోరాటం.. 'జైలర్​' రిలీజ్​ అప్పుడేనా?

హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య.. విలన్​ గ్యాంగ్​కు మధ్య ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు, రజనీకాంత్​ నటిస్తున్న 'జైలర్‌' చిత్రం విడుదల తేదీపై చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.