ETV Bharat / state

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు - తెలంగాణ న్యూస్

Telangana TET Notification 2023 : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు రెండున్నర లక్షలకు పైగా... దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

TET
Etv Bharat
author img

By

Published : Aug 16, 2023, 8:56 AM IST

TET Exam Last Date For Application టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

Telangana TET Notification 2023 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌కు(TS TET EXam) భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. మంగళవారం వరకు రెండున్నర లక్షలకు పైగా.. దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మొత్తంగా 2లక్షల 50 వేల 963 దరఖాస్తులు రాగా.. వీటిలో కేవలం డీఈడీ అభ్యర్థులు రాసే పేపర్‌-1కు 74వేల 26 మంది దరఖాస్తు చేశారు. పేపర్‌-2కు 16వేల 6 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు పేపర్లూ రాసేందుకు లక్షా 60వేల 931 మంది.. దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

TS TET Notification 2023 : గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్‌ చేశారు(TET Exam Centers). హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కొత్తగూడెం జిల్లాల్లో పరీక్షా కేంద్రాల సామర్థ్యం నిండిపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి సొంత జిల్లాల్లో రాసే వీలు ఉండకపోవచ్చు. ఈ కారణంగా తగినన్ని పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష(TET Exam) నిర్వహించి 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. హాల్‌టికెట్లు సెప్టెంబర్‌ 9 నుంచి అందుబాటులో ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

టెట్ పరీక్ష.. 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి.. అనుమతించని అధికారులు

TET Exam Dates Schedule : సెప్టెంబరు 15న ఉదయం 9.30 నిమిషాలల నుంచి 12.00 గంటల వరకు పేపర్‌ వన్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పేపర్‌ టూ పరీక్ష జరగనుంది. గతంలో జరిగిన టెట్‌తో పోలిస్తే పరీక్ష ఫీజు రూ.100 పెంచి, ఒక పేపర్‌ లేదై రెండు పేపర్లు రాసినా రూ.400లుగా నిర్ణయించారు. రాష్ట్రంలో సుమారు 13,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది.

టెట్ అర్హత కాలపరిమితి ఎన్ని సంవత్సరాలంటే : టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ వన్‌కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. పేపర్‌-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్‌-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే పాఠశాల అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. గతేడాది జూన్‌ 12వ తేదీన నిర్వహించిన టెట్‌ పేపర్‌-1లో 1లక్ష 4,078 మంది అర్హులు కాగా, పేపర్‌-2లో 1,24,535 మంది అర్హత సాధించారు.

Telangana TET 2023 : మరోసారి 'టెట్‌' నిర్వహణ.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం

TET SA Exam: టెట్‌ ఎస్‌ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం

TET Results 2022 : టెట్‌ పేపర్‌-2లో డబుల్‌ ఉత్తీర్ణత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.