Telangana TET 2023 Hall Tickets Released : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (Telangana Tet 2023) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. tstet.cgg.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ 040-23120340, 040-23120433 నంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
TET SA Exam: టెట్ ఎస్‌ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం
TS TET 2023 :సెప్టెంబరు 15న టెట్ పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు. పేపర్-1 ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
Telangana TET 2023 : ఇటీవలే టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వాటిలో పేపర్-1కు 2.70 లక్షలు, పేపర్-2కు 2.08 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు గడువు ఆగస్టు 17న అర్ధరాత్రి 12:00 గంటలకు ముగిసిందని.. గతేడాది (మొత్తం 6.28 లక్షలు)తో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య లక్షన్నర వరకు తగ్గిందని అధికారులు వివరించారు.
దరఖాస్తులు ఇలా..
- పేపర్-1: 2,69,557
- పేపర్-2: 2,08,498
- రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు: 1,86,997
- పోటీపడే అభ్యర్థుల మొత్తం సంఖ్య: 2,91,058
టెట్ అర్హత కాలపరిమితి ఎన్ని సంవత్సరాలంటే : ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే పాఠశాల అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులవుతారు. గత సంవత్సరం జూన్ 12న నిర్వహించిన టెట్ పేపర్-1లో 1,04,078 మంది అర్హులు కాగా, పేపర్-2లో 1,24,535 మంది అర్హత సాధించారు.
టెట్ పరీక్ష.. 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి.. అనుమతించని అధికారులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జూన్.. 2012 జనవరి, జూన్, 2014 మార్చిలో టెట్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 మే, 2017 జులై, గత సంవత్సరం జూన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. ఇంతకుముందు ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సి వచ్చేది. ఇందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ.. ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అందుకనుగుణంగా విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11 నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది.
Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'