ETV Bharat / state

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లే!

రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటివరకు ఉన్న 11 పరీక్షలను ఆరుకు కుదించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. పదో తరగతికి తప్పనిసరిగా ఏదో ఒక రూపేణా పరీక్షలను నిర్వహించాలని కసరత్తు చేస్తోంది.

author img

By

Published : Dec 18, 2020, 6:51 AM IST

telangana tenth exams Proposal to reduce 11 tests to six
11 పరీక్షలు ఆరుకు కుదించాలని ప్రతిపాదన!

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇప్పటివరకు ఉన్న 11 పరీక్షలను ఆరుకు కుదించాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. పదో తరగతికి తప్పనిసరిగా ఏదో ఒక రూపేణా పరీక్షలను నిర్వహించాలన్నది విద్యాశాఖ నిర్ణయం. మే నెల మధ్య నుంచి పరీక్షలను ప్రారంభించాలని రెండు నెలల క్రితమే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకు విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమైనందున గతంలో మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే ఒత్తిడికి గురవుతారని అధికారులు భావిస్తున్నారు.

విద్యాశాఖ కసరత్తు

గత ఏడాది వరకు హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టుల్లో ఒక్కోదానికి రెండు పేపర్లు ఉండేవి. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష జరపాలన్నది యోచన. అంతేకాకుండా ప్రశ్నల్లో ఛాయిస్‌తోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్య కూడా పెంచనున్నారు. దీనిపై రెండు నెలల క్రితమే చిత్రా రామచంద్రన్‌ ఆదేశించారు. ఈ క్రమంలోనే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులున్నారు. బడులు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

పండగల తర్వాతే?...

బడులు తెరవడంపై విద్యాశాఖ ఆలోచనలు, ప్రతిపాదనలు మారుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి తర్వాత 9, 10, తరగతులకు విద్యాసంస్థలను తెరిచి ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

4 నెలల సమయం

క్రిస్మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే తెరిసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపడేయం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత వెంటనే తెరిచినా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల ప్రారంభానికి దాదాపు 4 నెలల సమయం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏయే రాష్ట్రాల్లో బడులు తెరిచారో అధికారులు సేకరించారు. ఇప్పటివరకు దేశంలో ఏడు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను తెరిచారని చెబుతున్నారు.

ఇదీ చూడండి: మరో 9 వేల పోస్టుల భర్తీ... కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ నియమాకాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.