పాలిటెక్నిక్, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 12న పాలీసెట్ జరగనుంది. పాలీసెట్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ప్రకటించింది. మే1 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుము రూ.100తో మే 24 వరకు, రూ.300తో మే 25 వరకు చెల్లించవచ్చని ఎస్బీటీఈటీ తెలిపింది.
పరీక్ష ఫలితాలను జూన్ 24న వెల్లడిస్తారు. పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరం సిలబస్ ప్రాతిపదికనే పాలీసెట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చదవండి: 'ఎడ్యూ బజార్' సైన్స్ ప్రదర్శనలో మంత్రులు గంగుల, కొప్పుల