ETV Bharat / state

Telangana Teacher Transfers 2023 : సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల - సెప్టెంబరు 3 నుంచి తెలంగాణ టీచర్ల బదిలీలు

Telangana Teacher Transfers 2023 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 3 నుంచి టీచర్​ బదిలీల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను అక్టోబరు 3లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

Telangana Teacher Transfers From September 3
Telangana Teacher Transfers 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 7:55 PM IST

Updated : Aug 31, 2023, 8:12 PM IST

Telangana Teacher Transfers 2023 From September 3 : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల(Teacher Transfers) ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indhrareddy) తెలిపారు. ఈ ప్రక్రియలో టీచర్ల పదోన్నతులు, బదిలీ(Teacher Promotions)లు అక్టోబరు 3లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం లేదా శనివారం టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

కోర్టు తీర్పునకు లోబడి టీచర్ల పదోన్నతులు బదిలీలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకతతో, అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. బదిలీలకు విధి, విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన టీచర్లకు మెసేజ్​ పంపాలని అన్నారు. ఆన్​లైన్​ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

ఒకే ఒక విద్యార్థి.. ఆమె కోసం ఐదుగురు ఉపాధ్యాయులు..!

Telangana Teacher Promotions 2023 : అయితే కొందరు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉపాధ్యాయ ఖాళీల భర్తీని.. డీఎస్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీలపై తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ధికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విధంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తుండటాన్ని కాంగ్రెస్​ సహించలేకపోతోందని విమర్శించారు. తొమ్మిదేళ్లలో విద్యారంగం అభివృద్ధికి రూ.1,87,269 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 2017లో 8,972 టీచర్​ పోస్టులను భర్తీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

స్కూల్​​ యూనిఫామ్​లో టీచర్​.. పిల్లల్లో కలిసిపోయి, ఆటపాటలతో పాఠాలు

Teacher Transfers are Likely to Take Place From September 3 : గెజిటెడ్​, ప్రైమరీ స్కూల్​ హెడ్​ మాస్టర్​ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5,089 టీచర్​ పోస్టులు, 1,523 స్పెషల్​ ఎడ్యుకేషన్​ టీచర్స్​ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పదోన్నతులు, బదిలీలు, నూతన నియామకాల తర్వాత ఖాళీలు ఉంటే భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురుకులాల్లో 11,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇంకా గురుకులాల్లో 12,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. డీఎస్సీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. డీఎస్సీని అడ్డుకునే వారి మాటలు నమ్మవద్దని అభ్యర్థులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఇప్పటికే హైకోర్టు టీచర్ల బదిలీలు చేపట్టాలని గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు బదిలీలకు రంగం సిద్ధం చేసింది.

High Court Permits Teachers Transfers in Telangana : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Last Updated : Aug 31, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.