Telangana Tax Revenue Increased : ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రం పన్ను ఆదాయంలో 28 శాతాన్ని (Telangana revenue increased) అందుకొంది. జులై నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు అంచనాల్లో 22 శాతాన్ని చేరగా... అన్ని రకాలుగా 63 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఏప్రిల్ మొదలు నాలుగు నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.2 వేల317 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.
Telangana State Tax Growth : పన్ను ఆదాయం, రెవెన్యూ రాబడుల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే వెళ్తోంది. జులైతో ముగిసిన నెల వరకు రాష్ట్ర ఆదాయ, వ్యయ వివరాలను కంప్ర్టోలర్ అండ్ అడిటర్ జనరల్ - కాగ్‌కు నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి (Telangana Economic Growth) నాలుగు నెలల్లో రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ.42 వేల 712 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయం బడ్జెట్ అంచనా లక్షా 52 వేల 499 కోట్లు కాగా... అందులో ఇప్పటి వరకు 28 శాతానికి పైగా వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ12 వేల 224 కోట్లు.. స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 4 వేల 686 కోట్లు... అమ్మకం పన్ను ద్వారా రూ.10,171 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.6,074 కోట్లు.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.4,026 కోట్లు... ఇతర పన్నుల ద్వారా రూ.2,528 కోట్లు సమకూరాయి.
New Industries Telangana 2023 : తెలంగాణలో కొత్త పరిశ్రమలు.. ఉపాధి కల్పనే ధ్యేయం
GST Collection Telangana 2023 : జూన్ నెలతో పోలిస్తే జులైలో పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది. జూన్‌లో పన్నుల రూపంలో రూ.11,627 కోట్లు రాగా... జులైలో రూ.10,987 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం దాదాపు 8 శాతంతో రూ.1,815 కోట్లు వచ్చింది. పన్నేతర ఆదాయం కూడా గత నెల తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో భారీగా రూ.41,259 కోట్లు వస్తాయని అంచనా వేయగా... జులై వరకు అందులో కేవలం 5.6 శాతం రూ.2,317 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.
అన్ని రకాలుగా రెవెన్యూ రాబడులు మొదటి నాలుగు నెలల్లో రూ.46,845 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనా అయిన రూ.2,16,566 కోట్లలో ఇది దాదాపు 22 శాతంగా ఉంది. జులై వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20,637 కోట్లు రుణంగా తీసుకొంది. మొత్తం అన్ని రకాలుగా ఖజానాకు రూ.67,494 కోట్లు సమకూరాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.63,607 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయం రూ.50,303 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.13,304 కోట్లు. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.17,261 కోట్లు.. సామాజిక రంగంపై రూ.22,427 కోట్లు... ఆర్థిక రంగంపై రూ.23,918 కోట్లు ఖర్చు చేసింది. గత నెల వరకు వడ్డీ చెల్లింపుల కోసం రూ.7,174 కోట్ల వ్యయం చేసింది. ఉద్యోగుల వేతనాల కోసం రూ.13,686 కోట్లు... పెన్షన్ల కోసం 5,461 కోట్లు ఖర్చు చేసింది.
KTR Review on Musi Development Project : మూసీ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు..