ETV Bharat / state

కరోనా బారిన పడిన పాత్రికేయులకు అండగా ఉంటాం: అల్లం నారాయణ

కొవిడ్​ మహమ్మారి బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థికంగా అండగా ఉంటున్నామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 686 మంది జర్నలిస్టులకు... 1,28,60,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

కరోనా బారిన పడిన పాత్రికేయులకు అండగా ఉంటాం: అల్లం నారాయణ
కరోనా బారిన పడిన పాత్రికేయులకు అండగా ఉంటాం: అల్లం నారాయణ
author img

By

Published : Aug 28, 2020, 8:03 PM IST

రాష్ట్రంలో కరోనా బారిన పడిన పాత్రికేయులకు 1,28,60,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వారిలో పాజిటివ్ వచ్చిన 600 మందికి 20వేల చొప్పున... కోటి 20 లక్షలు, హోం క్వారంటైన్​లో ఉన్న 86 మందికి పదివేలు చొప్పున 8,60,000 పంపిణీ చేసినట్లు తెలిపారు.

తాజాగా వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... కొత్తగా మరో 73 మందికి పాజిటివ్ వచ్చిందని అన్నారు. వారికి ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పాజిటివ్​ వచ్చిన పాత్రికేయులు తమ వివరాలతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఛైర్మన్ వాట్సప్ నెంబర్​కి పంపాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.