పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు వాణి దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్టిలకు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సంపూర్ణ మద్ధతును ప్రకటించింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావును ఆ సంఘ నేతలు ఆయన నివాసంలో కలిశారు.
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంఘం మద్ధతు తెలుపుతూ చేసిన తీర్మాన ప్రతిని హరీశ్‌కు అందజేశారు. తమ సర్వీసు నిబంధనలు, పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు.
ఇదీ చూడండి: విశాఖ ఉక్కుపై కేటీఆర్ వ్యాఖ్యలు శుభపరిణామం: చాడ