హైదరాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని డిప్యూటీ కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి: అన్ని రంగాల్లో ప్రగతి సాధించాం: కేసీఆర్