ETV Bharat / state

కరోనా రోగులకు ఓటు హక్కు వినియోగం: ఎస్ఈసీ

author img

By

Published : Nov 21, 2020, 5:36 PM IST

కరోనా పాజిటివ్​ రోగులకు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్​ఈసీ వెల్లడించింది. ఇంతే కాకుండా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నేరుగా పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్​కు అవకాశం కల్పించింది.

కరోనా రోగులకు ఓటు హక్కు వినియోగం: ఎస్ఈసీ
కరోనా రోగులకు ఓటు హక్కు వినియోగం: ఎస్ఈసీ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరోనా పాజిటివ్ గల ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో పాటు పాజిటివ్ గల ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తమ ఓటు వేయొచ్చని స్పష్టం చేసింది. కరోనా రోగులు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లౌవ్స్ ధరించి కొవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించింది.

ఇక దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్​కు అవకాశం కల్పించింది. దీంతో పాటు నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులకు ర్యాంపులు ఏర్పాటు చేసి, వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లల తల్లులు క్యూలైన్​తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చని సర్క్యులర్ జారీచేసింది.

ఇదీ చదవండి: గ్రేటర్​ పోరు: కుత్బుల్లాపూర్​లో ఉద్రిక్తత.. ఎస్సైకి గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.