గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ నవంబర్ 12న విడివిడిగా భేటీ కానుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన ధరావత్తు సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే ప్రకటించడంతోపాటు పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చించనుంది.
ఇదీ చదవండి: నేడు కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్