ETV Bharat / state

'కేసీఆర్​ ఉన్నంత కాలం రైతు బంధు అమలవుతుంది' - సీఎం కేసీఆర్​ వార్తలు

పసుపు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు.. మార్క్ ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రైతు బంధు కొందరికి అందని మాట వాస్తవమేనని.. దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. కేసీఆర్​ బతికున్నంత కాలం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, బీమా అమలవుతాయని హామీ ఇచ్చారు. రైతు రుణాల్లో రాష్ట్రం ఇచ్చే 4 శాతం వడ్డీ మాఫీని త్వరలోనే చూస్తామన్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచినట్లుగా రాష్ట్రంలో కూడా ఎస్టీ రిజర్వేషన్లు పెంపుపై సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

'కేసీఆర్​ ఉన్నంత కాలం రైతు బంధు అమలవుతుంది'

author img

By

Published : Mar 8, 2020, 5:01 AM IST

Updated : Mar 8, 2020, 8:32 AM IST

శాసన మండలిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పేరిట యువతను మభ్యపెట్టొద్దని విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. డిఫెన్స్‌, రైల్వే, బ్యాంకింగ్‌ రంగాల్లోకి మన యువత వెళ్లడం లేదని.. ఏ రంగంలో అవకాశాలున్నాయో యువతకు తెలిపి తర్ఫీదు ఇస్తామన్నారు. అందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన చేయకుండా ఎవరికి తోచిన రంగాల్లో వారు రాణించాలని సీఎం సూచించారు.

తను​ బతికున్నంత కాలం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, బీమా అమలవుతాయని కేసీఆర్​ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదని ముఖ్యమంత్రి తెలిపారు. పాజిటివ్ కేసు బాధితునికి వైరస్‌ ఇక్కడ పుట్టలేదని... ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. ఉద్యోగులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను కూడా త్వరలో ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.

దశల వారీగా పాఠశాలల అభివృద్ధి:

రాష్ట్రంలో పాఠశాల విద్యను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య అందడం లేదని కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల బిడ్డలను కూడా ప్రైవేటు ఆంగ్ల పాఠశాలకు పంపిస్తున్నారని.. విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఇక్కడి పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మార్చుతామని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ తీసుకొస్తామని.. ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూల్ చేస్తే కుదరదన్నారు. విశ్వవిద్యాలయాల్లో త్వరలోనే వీసీలను నియమించి.. కావాల్సిన సిబ్బంది నియామకం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంబంధ విషయాలపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి.. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరుద్యోగ భత్యం ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదని... ఎవరికి ఇవ్వాలో స్పష్టత వచ్చాక అమలు చేస్తామని చెప్పారు.

ప్రజలకు వ్యతిరేకమైతే కొట్లాడతాం..

కేంద్రం నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి ఇబ్బందులేమీ లేవని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే కొట్లాడతామని.. పౌరసత్వ సవరణ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు రాలేదని.. వాటికోసం పోరాడుతున్నామన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఏ కేంద్ర ప్రభుత్వమూ తగ్గించలేదని.. మోదీ ప్రభుత్వం కూడా రాష్ట్రం వాటా తగ్గించలేదన్నారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద ఈ ఏడాది రూ.15 వేల కోట్లే వచ్చిందని.. రూ.3, 600 వేల కోట్లకు పైగా తగ్గించారని తెలిపారు. పన్నుల్లో వాటా తగ్గినందుకు అదనపు అప్పు కింద రూ.1,450 కోట్లు తీసుకునేందుకు అనుమతి ఇస్తూ లేఖ పంపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌పీఆర్‌పై అభిప్రాయ భేదాలు ఉన్నాయని.. ఇటూ రిజర్వేషన్లతో పాటు ఈ రెండు విషయంలో పోరాటం సాగిస్తామని సీఎం పేర్కొన్నారు.

రిజర్వేషన్లు పెంచాలి:

గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్ వెంటనే పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా మన రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని.. ఎవరికి వస్తుందో లేదో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణాల్లో రాష్ట్రం ఇచ్చే 4 శాతం వడ్డీ మాఫీ అమలు చేయడం లేదని.. రైతు దీర్ఘకాలిక, మధ్యకలిక రుణాల్లో వెంటనే వడ్డీ మాఫీ అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే రాయితీలను నిలిపివేసి కేవలం.. రైతు బందు మాత్రమే ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక కేంద్రం పసుపు రైతులను పట్టించుకోవడం లేదని.. రాష్ట్రం పసుపు రైతులను ఆదుకోవాలని మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొని మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షా 50 వేల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఎంత మంది పేదలకు ఇచ్చారో చెప్పాలని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు నిలదీశారు. భైంసా అల్లర్లకు కారణం ఎవరని.. పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఇవీ చూడండి : రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్​ సభ్యుల సస్పెషన్

Last Updated : Mar 8, 2020, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.