ETV Bharat / state

congress leaders meeting: దిల్లీకి చేరిన హుజూరాబాద్​ ఉప ఎన్నిక పంచాయతీ - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల (huzurabad by election) పంచాయతీ దిల్లీ చేరింది. ఏఐసీసీ పిలుపుతో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు దేశ రాజధానికి చేరుకున్నారు (congress high command calls telangana leaders to Delhi). టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (tpcc president revanth reddy), హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్​ (balmuri venkat)తోపాటు 13 మందికి నాయకులకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (AICC General Secretary kc Venugopal) ​తో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమావేశంకానున్నారు.

congress
congress
author img

By

Published : Nov 13, 2021, 5:03 AM IST

ఏఐసీసీ పిలుపుతో కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నేతలు దేశ రాజధానికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (tpcc president revanth reddy) హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ (balmuri venkat) ​తోపాటు 13 మందికి నాయకులకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 10.30 గంటలకు దిల్లీ కాంగ్రెస్‌ వార్​రూమ్‌లో కేసీ వేణుగోపాల్​తో (AICC General Secretary kc Venugopal) భేటీ కానున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో (huzurabad by election) ఓటమికి గల కారణలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమి కావడంపై పీసీసీ నుంచి ఇప్పటికే అధిష్ఠానానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే... సీనియర్ నేత హనుమంతరావు (V Hanumanth Rao) ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి (aicc president sonia gandhi) లేఖ రాశారు.

ఇదీ చూడండి: Congress Leader VH: ఆ పని చేస్తా.. సోనియాకు బహుమతిగా ఇస్తా: వీహెచ్

కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన ఓటుబ్యాంక్ ఉంటుంది. కానీ హుజురాబాద్​లో ఆ ఓటు బ్యాంకు ఓట్లు కూడా రాలేదు. నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులు కూడా యాక్టివేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మూడు వేల వచ్చాయని సమగ్ర సమీక్ష ఏర్పాటు చేసి... ఏక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి సవరించుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని... లేఖలో హనుమంతు రావు ప్రస్తావించారు. ఇవాళ జరిగే ఏఐసీసీ సమావేశంలో లోతైన సమీక్ష జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

ఓటమిపై ప్రత్యేక కమిటీ

రాష్ట్ర కాంగ్రెస్​ నేతలకు అధిష్ఠానం నుంచి (congress high command calls telangana leaders to Delhi)పిలుపుతో దిల్లీకి వెళ్లారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే వచ్చిన అంశాన్ని పార్టీ హైకమాండ్​ తీవ్రంగా పరిగణించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌ ఓటమిపై కర్ణాటక రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఓ కమిటీని వేసిన ఏఐసీసీ.. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

దిల్లీకి వెళ్లిన నేతలు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(clp leader batti vikramarka), ఇద్దరు ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, హుజూరాబాద్​ ఉపఎన్నికల అభ్యర్థి బల్మూరి వెంకట్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఏఏ అంశాలపై చర్చించవచ్చు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడానికి కారణాలు (huzurabad by poll result) ఏమిటి? ఇతర పార్టీల బలాలు ఏమిటి? కాంగ్రెస్‌ పార్టీ బలహీనతలు ఏమిటి? అభ్యర్థి ఎంపికలో చోటు చేసుకున్న జాప్యం, ప్రచారం నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం తదితర అంశాలపై ఏఐసీసీ స్థాయిలో సమీక్ష చేసేందుకు కాంగ్రెస్​ నేతలను అధిష్ఠానం దిల్లీకి పిలిచినట్లు ఆ పార్టీ సీనియర్​ నేత వి.హనుమంతురావు తెలిపారు.

ఇదీ చూడండి: Telangana Congress: హుజూరాబాద్​ ఎఫెక్ట్​.. అధిష్ఠానం నుంచి కాంగ్రెస్​ నేతలకు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.