ETV Bharat / state

TS Cabinet Meeting: నూతన సచివాలయంలో త్వరలో తొలి కేబినెట్​ భేటీ - హైదరాబాద్ తాజా వార్తలు

TS Cabinet Meeting in New Secretariat : రాష్ట్ర మంత్రివర్గం త్వరలో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఖరారు సహా ఇతరత్రా అంశాలపై మంత్రివర్గంలో చర్చించవచ్చని సమాచారం.

TS Cabinet Meeting
TS Cabinet Meeting
author img

By

Published : May 5, 2023, 11:31 AM IST

TS Cabinet Meeting in New Secretariat : కొత్త సచివాలయంలో తొలి కేబినెట్​ భేటీ త్వరలోనే జరగనుంది. మంత్రివర్గాన్ని సమావేశపరిచి.. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు కేబినెట్​ను సమావేశ పరచవచ్చని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపు కోసం చేసిన చట్టసవరణ బిల్లుతో పాటు పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లును గవర్నర్ వెనక్కు పంపారు.

: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, పంచాయతీరాజ్, అజామాబాద్ పారిశ్రామిక వాడల చట్ట సవరణ బిల్లులపై ప్రభుత్వ వివరణ కోరారు. దీంతో వీటి విషయంలో తదుపరి ఏం చేయాలన్న విషయమై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్​కు మళ్లీ పంపాలని అనుకుంటే ఉభయసభలను సమావేశపరిచి చర్చించి ఆమోదించి పంపవచ్చు. అకాల వర్షాలకు పంట నష్టం, పోడుభూముల పట్టాల పంపిణీ, దళిత బంధు, గృహలక్ష్మి, తదితర అంశాలపై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది.

గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. దిల్లీ పర్యటన కూడా పూర్తయిన నేపథ్యంలో సంబంధించిన అంశాలపై సీఎం దృష్టి సారిస్తారని, త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంటున్నాయి.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం: గతంలో పెండింగ్​లో ఉన్న మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను పున:పరిశీలన నిమిత్తంగా వెనక్కి తిప్పి పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు. ఇంకో రెండు బిల్లులపై తమిళిసై ఇంకా నిర్ణయానికి రాలేదు. అయితే గవర్నర్ తమిళిసై వద్ద 10 బిల్లులు పెండింగ్​లో ఉండగా.. వాటిని ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం దారుణం: బిల్లుల ఆమోదంలో గవర్నర్‌ తీరుపై.. గతంలో బీఆర్​ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేంద్రం చేతిలో కీలు బొమ్మగా... గవర్నర్‌ వ్యవహరిస్తున్నారంటూ పలువురు మంత్రులు విమర్శించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.