పశ్చిమ బంగాల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు రాళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయుకుడి వాహనంపైనే రాళ్లు రువ్వారంటే అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అవగతమవుతున్నాయన్నారు.
తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి భాజపా కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల పరిపాటిగా మారిందన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు భాజపా కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్ భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇదీ చూడండి: అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్