గణేశ్ ఉత్సవాల నిర్వహణపై హైకోర్టు తీర్పును గౌరవించి అధికారులు చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇది హిందువుల విజయమని.. అయినా అడ్డంకులు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను తెలంగాణ హిందూ సమాజం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కోర్టు తీర్పు మేరకు నిరాటంకంగా గణేశ్ నవరాత్రులు జరుపుకుందామని పిలుపునిచ్చారు. హైకోర్టు తీర్పుని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.