ETV Bharat / state

రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు - 1.19 కోట్ల వంట గ్యాస్ వినియోగదారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 10:02 AM IST

Telangana State at A Glance-2023 Book launch : కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనాల ప్రకారం 2026 లో రాష్ట్ర జనాభా మూడు కోట్లా 86 లక్షలు 2031లో మూడు కోట్లా 92 లక్షలు దాటనుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్​లో పలు వివరాలు పొందుపరిచారు. రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య 90 లక్షలకు పైగా ఉండగా వంట గ్యాస్ వినియోగదారులు కోటీ 19 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయంలో 2014 నుంచి 2023 వరకు పెరుగుదల 150 శాతానికి పైగా ఉంది.

Telangana State at a Glance-2023 Book
Telangana State at a Glance-2023 Book launched By Bhatti Vikramarka
'తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ - 2023 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి'

Telangana State at A Glance-2023 Book launch : రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ - 2023 పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు వివరాలు, జనాభా, ఆర్థికపరమైన అంశాలు, విద్యుత్, నీటిపారుదల, రవాణా, సంక్షేమం, విద్య, వైద్యం తదితరాల గురించి ఇందులో పేర్కొన్నారు.

Telangana Population in 2026 : కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనాల ప్రకారం 2026లో రాష్ట్ర జనాభా మూడు కోట్ల 86 లక్షలు దాటుతుందని 2031లో రాష్ట్ర జనాభా మూడు కోట్లా 92 లక్షలు దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 2014 నుంచి 2023 వరకు ప్రస్తుత ధరల ప్రకారం 159.6 శాతం, స్థిరధరల ప్రకారం 74.5 శాతం పెరిగినట్లు తెలిపారు.

తెలంగాణ తలసరి ఆదాయం 2014-2023 : 2014లో రూ.1,24,104 ఉన్న తలసరి ఆదాయం 2023 వరకు 151.7 శాతం వృద్ధితో రూ.3,12,398 చేరుకున్నట్లు నివేదించారు. ఇదే సమయంలో జాతీయ వృద్ధి 98.8 శాతంగా ఉన్నట్లు తెలిపారు. అమ్మకం పన్నులు 161.96 శాతం, రిజిస్ట్రేషన్ల రాబడిలో 406.26 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు. 2014-15లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 10.8 మీటర్లు కాగా 2022- 23 నాటికి అది 6.22 మీటర్లకు చేరినట్లు తెలిపారు. భూగర్భ జలాల పరంగా రాష్ట్రంలోని 494 మండలాలు సురక్షిత దశలో ఉండగా 80 సెమీ క్రిటికల్​గా ఏడు క్రిటికల్​గా ఉన్నట్లు పేర్కొన్నారు. 13 మండలాల్లో భూగర్భ జలాలను పరిమితికి మించి తోడినట్లు తెలిపారు.

మూడో గ్యారంటీపై సర్కార్ ఫోకస్ - రూ.2 లక్షల రుణమాఫీపై కసరత్తు షురూ

2014- 15లో సాగు విస్తీర్ణం 131.34 లక్షల ఎకరాలు కాగా 2021-22 నాటికి అది 51.04 శాతం పెరిగి 198.37 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపారు. పూర్తిచేసిన తొమ్మిది భారీ ప్రాజెక్టుల ద్వారా 21 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు 92 వేల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించినట్లు తెలిపారు. 24 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు 14 లక్షల ఎకరాలకు పైగా పాత ఆయకట్టును స్థిరీకరించినట్లు వివరించారు. పూర్తిచేసిన 27 మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా మూడు లక్షల ఎకరాల ఆయకట్టు పది ఆన్ గోయింగ్ మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 53 వేల ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు తెలిపారు.

ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం

తెలంగాణ అటవీ విస్తీర్ణం : 2011 సర్వే ప్రకారం హైదరాబాదులో అటవీ విస్తీర్ణం 33 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండగా 2021 నాటికి 147 శాతం పెరిగి 81 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. 2017 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగింది. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 68.47 శాతం పెరిగినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యపరంగా పలు సూచికల్లో తెలంగాణ స్థానం బాగా మెరుగైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు 90 లక్షల ఐదు వేల 748 ఉన్నాయి. వంటగ్యాస్ కోసం రిజిస్టర్ అయిన వినియోగదారుల సంఖ్య కోటీ 19 లక్షల 93 వేల 947గా ఉన్నట్లు తెలిపారు.

ఆ 3బిల్లులను వెనక్కి తీసుకున్న కేంద్రం- వాటిస్థానంలో కొత్తవి ప్రవేశపెట్టిన షా- శుక్రవారం ఓటింగ్

'నన్ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు' - కేసీఆర్​ వీడియో సందేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.