ETV Bharat / state

బడ్జెట్ సమావేశాలపై నేడు సభాపతుల సమీక్ష - Telangana budget news

Telangana budget sessions 2023-24: బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉభయసభల సభాపతులు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు.మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు.

Telangana budget sessions
Telangana budget sessions
author img

By

Published : Feb 1, 2023, 9:34 AM IST

Telangana budget sessions 2023-24: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉభయసభల సభాపతులు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు.

Speaker Review On Telangana Budget sessions: సభ్యుల ప్రశ్నలు, శూన్యగంట తదితరాలకు సమాధానాలు, సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి తదితరులతో సమీక్షిస్తారు. సమావేశాల సందర్భంగా భద్రతా పరమైన ఏర్పాట్లపై డీజీపీ అంజనీ కుమార్, పోలీసు అధికారులతో సమావేశమై చర్చిస్తారు.

ఉభయసభలను ప్రొరోగ్‌ చేయకుండానే.. గత సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎన్ని రోజులు జరపాలనేది శుక్రవారం సభ ముగిసిన అనంతరం బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్‌ తమిళిసై బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.

సోమవారం హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించారు. ఆ తర్వాతనే బడ్జెట్‌ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.

మరోవైపు రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 14 వరకూ నిర్వహించే అవకాశాలున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం సర్దుకుంటుందని తాను ముందే చెప్పానన్నారు. గవర్నర్‌తో విభేదాలు వస్తాయి.. పోతాయని, గవర్నర్‌, ప్రభుత్వం, అసెంబ్లీ.. ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయని, ఇందులో ఎవరి విజయం ఉండదని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో గవర్నర్‌ ప్రసంగం ఉండదనే తాను భావిస్తున్నానని, గవర్నర్‌ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు.. గత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన 8 బిల్లుల్లో 7గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివాదం సమసిపోయినందున.. బిల్లుల అంశానికి కూడా పరిష్కారం లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.