How to Apply Single Women Pension Scheme in Telangana: నిరుపేద కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం "సింగిల్ ఉమెన్" పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2017, జూన్2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు అందించగా.. తరువాత దానిని 2వేల 16 రూపాయలకు పెంచారు. మరి ఈ సాయం పొందేందుకు అర్హులు ఎవరు? నిబంధనలేంటి? దరఖాస్తు ఎలా చేయాలి..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సింగిల్ ఉమెన్ పింఛన్‌కు అర్హులు ఎవరు..?
Who is Eligible For Single Women Pension:
- వివాహిత: 18 ఏళ్ల వయస్సు నిండి పెళ్లి అయ్యాక భర్త నుంచి విడిపోయి వేరుగా ఉన్న వారు ( కనీసం ఏడాది కాలానికి పైగా )
- అవివాహిత: వివాహం చేసుకోని మహిళలు. గ్రామీణులైతే 30 ఏళ్లు, పట్టణ వాసులైతే 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం: గ్రామీణులైతే లక్షా 50 వేలు, పట్టణవాసులైతే రూ. 2 లక్షలకు మించరాదు.
- లబ్ధిదారులు ప్రభుత్వ ఇతర పథకాల ద్వారా పింఛన్ పొందరాదు.
- ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా పింఛన్ అందుకునే వారు కూడా అనర్హులు.
- 57 ఏళ్ల వయస్సు నిండితే.. వృద్ధాప్య పింఛన్‌కు అర్హులవుతారు.
- ఒకవేళ సదరు మహిళ పెళ్లి చేసుకున్నా.. శాశ్వత ఉద్యోగం సంపాదించుకున్నా..ఈ పెన్షన్ నిలిచిపోతుంది.
How to Apply for Aasara Pension : ఆసరా పింఛన్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..?
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
How to Apply Single Women Pension Scheme in Telangana:
- గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో బిల్ కలెక్టర్, GHMC పరిధిలో వీఆర్వోకు దరఖాస్తు సమర్పించాలి.
- దరఖాస్తు ఫారాలు సదరు అధికారుల వద్ద నుంచి లేదా మీ సేవా సెంటర్ నుంచి పొందవచ్చు.
- దరఖాస్తు ఫారానికి ఫొటో, వయస్సు ధ్రువీకరణ కోసం.. ఆధార్ /ఓటరు కార్డు/బర్త్ సర్టిఫికెట్/పాఠశాల టీసీలో ఏదో ఒకటి జత చేయాల్సి ఉంటుంది.
- బ్యాంకు ఖాతా పాస్ బుక్ లేదా పోస్టాఫీస్ ఖాతా పాస్ బుక్ జత చేయాలి.
- ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
- అర్హులైన లబ్ధిదారులను గ్రామ లేదా వార్డు సభ ద్వారా ఎంపిక చేస్తారు.
- ఆయా దరఖాస్తులను మండల రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ పరీక్షిస్తారు.
- అర్హులకు పింఛన్ సిఫారసు చేస్తూ.. ఆసరా వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు.
- చివరగా.. ఆయా దరఖాస్తులను కలెక్టర్ పరిశీలనకు పంపి ఆమోదిస్తారు.
ఆ మార్గదర్శకాల్లో సవరణ.. 57 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛన్