ETV Bharat / state

గొర్రెల పంపిణీ నిధుల గోల్​మాల్​లో ఉన్నతాధికారుల ప్రమేయం - రంగంలోకి ఏసీబీ

Telangana Sheep Scam 2024 : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలగా, ఇప్పటికే పలువురి అక్రమాలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో కేసులో ఏం జరగబోతుందని సర్వత్రా ఆసక్తి పెరిగింది.

Telangana Sheep Scam
Telangana Sheep Scam 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 8:15 AM IST

Updated : Jan 17, 2024, 9:47 AM IST

Telangana Sheep Scam 2024 : రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకంలో నిధుల గోల్‌మాల్‌ కేసును అనిశాకు రాష్ట్ర సర్కార్ బదిలీ చేసింది. దీంతో పాటు ఆ శాఖలో దస్త్రాల మాయం కేసును సైతం అవినీతి నిరోధక శాఖకి అప్పగించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు, దళారులు కలిసి గొర్రెల పంపిణీ పథకాన్ని(Sheep Distribution Scheme) పక్కదారి పట్టించి భారీగా నిధులు కాజేయడం, అమ్మకందార్లను, పెంపకందార్లను మోసగించడం, దస్త్రాల మాయం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

Telangana Sheep Distribution Funds Scam : 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రెండు విడతల్లో ఈ పథకం కింద రూ.6 వేల కోట్లను వెచ్చించారు. 4.50 లక్షల మందికి కోటి గొర్రెలను పంపిణీ చేసినట్లుగా గణాంకాలు కూడా నమోదు చేశారు. రెండో విడతను ప్రారంభించిన కొన్ని రోజులకు నిధుల కొరతతో ఆ పథకం ఆగిపోయింది.

Telangana Sheep Scam ACB Inquiry 2024 :: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్‌లోని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో దస్త్రాల మాయం ఉదంతం వెలుగుచూసింది. దీనిపై ఇంకా విచారణ సాగుతోంది. ఇది జరిగిన కొన్ని రోజులకే డిసెంబర్ 26న ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు వచ్చి తెలంగాణ గొర్రెల పథకంలో అక్రమాల గురించి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పశుసంవర్ధక శాఖ మేడ్చల్‌ జిల్లా ఏడీలు రవికుమార్‌, కేశవసాయితో పాటు లోలోనా లైవ్‌స్టాక్‌ కంపెనీ యజమాని సయ్యద్‌ మోయిద్‌, అతడి కుమారుడు ఇక్రమ్‌లపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.

పశుసంవర్ధక శాఖలో నిధుల గోల్‌మాల్‌ కేసు ఏసీబీకి బదిలీ- ఓఎస్డీ కల్యాణ్​ సహా పలువురిపై కేసు నమోదు

ఈ గొర్రెల పంపిణీ వ్యవహారంలో ప్రధానంగా దళారి మోయిదే కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. రాజకీయ పలుకుబడితో పాటు ఉన్నతాధికారుల అండతో లోలోనా లైవ్‌స్టాక్‌ కంపెనీ పేరిట ఈ కథ నడిపించాడని విచారణలో నిర్ధారించారు. పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో అతను గుత్తేదారుగా తిష్ఠ వేసి, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్నాడు. గొర్రెల పంపిణీ పథకం తన ద్వారానే నడుస్తోందని పోస్టర్లు వేయడంతో పాటు బ్రోచర్లను, కరపత్రాలను పంచిపెట్టాడు.

కొండాపూర్‌ మానస రెసిడెన్సీలోని ఫ్లాట్‌ నెం.44 కంపెనీ చిరునామాగా పేర్కొంటూ, తమ ద్వారానే గొర్రెల పథకం నడుస్తోందని వాటిల్లో పేర్కొన్నాడు. తన పరపతిని వివరిస్తూ అధికారులను బెదిరించిన వీడియోలు పోలీసులకు వద్దకు చేరాయి. గొర్రెల పంపిణీ పథకం నిబంధనలను అనుసరించి అధికారులు, లబ్ధిదారులు కలిసి విక్రయదార్ల వద్దకు వెళ్లి కొనాల్సి ఉంటుంది. కొనుగోలు చేశాక విక్రయదార్ల ఖాతాల్లో డబ్బులను జమ చేయాలి. కానీ ఈ పథకంలో అలా జరగలేదు. విక్రయదార్లకు బదులు అధికారులు దళారి మోయిద్‌ వద్ద గొర్రెలను కొన్నట్లు చూపారు. మోయిద్‌, అతడి కుమారుడు ఇక్రమ్‌ల బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్ల 10 లక్షల 14 వేలను వేశారు. మోయిద్‌తో పాటు మరికొందరికి దీంతో సంబంధం ఉన్నట్లు, పలువురు ఉన్నతాధికారులు కుమ్మక్కయి ఈ కథ నడిపించారని విశ్వసనీయ సమాచారం.

ఉన్నతాధికారుల ప్రేక్షకపాత్ర : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై పోలీసు కేసు నమోదైనా పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరపలేదని పోలీసులు గుర్తించారు. పైగా నిందితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది. పథకంలో ఒకే యూనిట్‌ను వంద యూనిట్లుగా చూపడం, రీ-సైక్లింగ్‌పై ఫిర్యాదులున్నట్లు తెలుస్తోంది. అలాగే దస్త్రాల మాయం, అందులో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌పై కేసు, ఇలాంటి పరిణామాలను గమనించిన పోలీసు ఉన్నతాధికారులు దీనిని కుంభకోణంగా గుర్తించి సర్కార్ దృష్టికి తీసుకెళ్లగా అనిశాని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు, ఫిర్యాదుదారులను, లబ్ధిదారులను, ఉన్నతాధికారులను కలిసి మొత్తం తతంగంపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

Sheep Distribution in Telangana : నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం

Harish Rao Distributed Sheeps : 'కేసీఆర్‌ పాలన.. తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగమే'

Last Updated : Jan 17, 2024, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.