ETV Bharat / state

మసకబారుతున్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిష్ఠ - డిప్యుటేషన్లు, ఫారిన్‌ సర్వీస్‌ల పేరిట ఏళ్ల తరబడి తిష్ఠ - illegal deputations

Telangana SCERT Issue : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రధానంగా ఎస్‌సీఈఆర్‌టీలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నాయి. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

Teacher Transfer Process Issue
Telangana SCERT Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 2:07 PM IST

Telangana SCERT Issue : ఉద్ధండులైన నిపుణుల కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులకు పునరావాస కేంద్రమైంది. విద్యపై పరిశోధనలు చేస్తూ కాలానుగుణంగా పాఠ్య ప్రణాళికలు మారుస్తూ ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇస్తూ పాఠశాల విద్యకు దిక్సూచిగా నిలవడం ఎస్‌సీఈఆర్‌టీ ప్రధాన విధి.

Teacher Transfer Process Issue : ఇలా పాఠశాల విద్యకు అండగా ఉండాల్సిన విభాగం, రాజకీయ నాయకుల సిఫారసుల మేరకు హైదరాబాద్‌లో మకాం వేయాలనుకున్న వారికి ఓ వరంలా మారింది. ఇందులో ఇష్టారాజ్యంగా ఇస్తున్న డిప్యుటేషన్లు, ఫారిన్‌ సర్వీస్‌లను రద్దు చేయాలని త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో జరగనున్న సమావేశాలలో కోరేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు.

Teachers Meeting with CM : విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభ సమావేశాల్లో ప్రకటించారు. జనవరిలో ఈ సమావేశం ఉంటుందని ఉపాద్యాయులు భావిస్తున్నారు. ఆ సందర్భంగా బదిలీలు, పదోన్నతులతోపాటు ప్రధానంగా ఎస్‌సీఈఆర్‌టీలో అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని కోరనున్నారు. 6-9 తరగతుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రారంభించిన ఉన్నతి కార్యక్రమాన్ని రద్దు చేయాలని తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​ రెడ్డి

Inquiry into illegal deputations : ఇప్పటికే ఎస్‌సీఈఆర్‌టీలో అక్రమ డిప్యుటేషన్లపై విచారణ జరపాలని టీపీటీఎఫ్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించాయి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ నిబంధనల కారణంగా ఇక్కడున్న ఆచార్య, అధ్యాపకుల పోస్టులను పూర్తిగా శాశ్వత ఉద్యోగులతో భర్తీ చేయలేని పరిస్థితి. ఆరుగురు శాశ్వత ఆచార్యులు ఉండాల్సిన చోట ముగ్గురే ఉన్నారు. అధ్యాపక పోస్టులు 16 ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ 20 మంది వరకు డిప్యుటేషన్లు(అసలు స్థానంలో వేతనం తీసుకోవడం), ఫారిన్‌ సర్వీస్‌(ఎస్‌సీఈఆర్‌టీలో వేతనం తీసుకోవడం) పేరిట పనిచేస్తున్నారు.

Teacher Transfer Process Issue : సబ్జెక్టు నిపుణులైన స్కూల్‌ అసిస్టెంట్లను నియమించడం కొంత హేతుబద్ధత ఉందని చెప్పొచ్చు. విచిత్రమేంటంటే 1-5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్‌జీటీల)ను నలుగురిని అధ్యాపక స్థానాల్లో డిప్యుటేషన్‌పై నియమించడం గమనార్హం. ఎస్‌జీటీలను నియమించడమే తప్పని నిపుణులు చెబుతుంటే ఏడాదిన్నర క్రితం మోడల్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)గా పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలిని ఏకంగా ఎస్‌సీఈఆర్‌టీలో శాశ్వత లెక్చరర్‌(డిప్యూటీ ఈఓ స్థాయి)గా నియమించడం ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేసింది.

Telangana Teachers Problems : ఓ ఉపాధ్యాయుడు 15 సంవత్సరాలుగా ఎస్‌సీఈఆర్‌టీలోనే తిష్ఠవేశారు. ఇటీవలే ఆయన ఫారిన్‌సర్వీస్‌ ఉత్తర్వులు తెచ్చుకోవడం గమనార్హం. ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండానే ఇంతకాలం ఓ ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు తీసుకొని కార్యక్రమాలు రూపొందించారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఉన్నతి కార్యక్రమంపై పర్యవేక్షణకు ప్రతి డైట్‌ కళాశాలకు 10మంది వరకు ఉపాధ్యాయులను కంటిన్యుయస్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌(సీపీడీ) పేరిట నియమించారు. డీఈవోలనుంచి వారి జాబితాను తెప్పించుకోకుండా తన అనుయాయుల పేర్లను పంపి నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Teachers Fight For Spouse Transfers : స్పౌస్ ఉపాధ్యాయల ఆందోళన ఉద్రిక్తం.. పోలీసుల తీరుతో విలపించిన చిన్నారులు

Teacher promotions Postpone Telangana : టీచర్లకు షాకింగ్ న్యూస్.. పదోన్నతులకు బ్రేక్​.. ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.