ETV Bharat / state

రుణమాఫీకి అర్హులను గుర్తించేదెలా?

author img

By

Published : Mar 11, 2020, 9:23 AM IST

రుణమాఫీ పథకం కోసం అర్హులను గుర్తించే విషయంలో ఆర్థిక, వ్యవసాయ శాఖలు నిమగ్నమయ్యాయి. దీర్ఘకాలంగా అప్పులు కట్టకుండా మెుండి బకాయిదారుల జాబితాలో చేరిన వారికి మాఫీ చేయాలా, వద్దా అనే అంశంపై చర్చిస్తున్నాయి. అధికారుల సూచనలన్నీ దస్త్రంలో సీఎం కేసీఆర్‌కు నివేదించి.. ముఖ్యమంత్రి ఇచ్చే సూచనల ప్రకారం ఈ పథకం అమలుకు అధికారికంగా మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీకానున్నాయి.

telangana rythu runa mafi
రుణమాఫీకి అర్హులను గుర్తించేదెలా?

రుణమాఫీ పథకం అమలు కోసం సొమ్ము ఇవ్వాల్సిన రైతులను ఎలా గుర్తించాలనే అంశంపై వ్యవసాయ, ఆర్థిక శాఖలు మేథోమధనం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా బ్యాంకులకు అప్పులు కట్టకుండా మొండి బకాయిదారుల జాబితాలో చేరినవారికి మళ్లీ మాఫీ చేయాలా అనే అంశంపై చర్చిస్తున్నాయి. 2014 మార్చి 31 నాటికి రూ.లక్ష వరకూ బకాయి ఉన్న రైతులందరి అప్పులు తీర్చేందుకు తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.16,124 కోట్లు విడుదల చేసింది. ఈ సొమ్మును 4 దఫాలుగా ఒక్కోసారి రూ.25 వేల చొప్పున బ్యాంకులకు విడుదల చేసింది. దీని ప్రకారం 2014 మార్చి నాటికి రూ.లక్ష అప్పు వారి బకాయి మొత్తం తీరినట్లుగా అంచనా. ఇప్పుడు మళ్లీ రుణమాఫీ తిరిగి చేస్తున్నందున... 2014 మార్చికి ముందు బకాయి ఉన్నవారికి అప్పు ఉంటే ఇప్పుడు మాఫీ చేయాలా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

పాతబాకీలు కట్టనివారికి...

రుణమాఫీ పథకం ప్రకారం రూ.లక్ష వరకూ అప్పు ఉన్నవారే అర్హులని, అంతకుమించి ఏళ్ల తరబడి అప్పులున్నవారికి ఎందుకు కట్టాలని మంగళవారం ఆర్థిక, వ్యవసాయశాఖ అంతర్గత చర్చించింది. వరసగా నాలుగైదేళ్ల పాటు పంటరుణం చెల్లించకుండా, ఎగవేతదారుల జాబితా(ఎన్‌పీఏ)లో ఉన్నవారికి మాఫీ చేయడం ఎందుకని కొందరు అధికారులు సూచించారు. 2014లో మాఫీ చేసినప్పుడు పాత బాకీలు కట్టేసి కొత్త రుణం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఎక్కువ బకాయిలున్నవారు కొందరు పాతబాకీలు కట్టలేదు. వారికిప్పుడు మళ్లీ మాఫీ చేయడం ఎందుకని యోచిస్తున్నారు.

భూములు కౌలుకిచ్చిన వారు ఒకసారి పంట రుణం తీసుకుని తిరిగి కట్టకుండా ప్రభుత్వం ఎప్పటికైనా మాఫీ చేస్తుందని కొందరు ఎదురుచూస్తున్నారని, అలాంటివారికి రుణమాఫీ పథకం వర్తింపజేయడం ఎందుకనేది వారి వాదన. నిజమైన రైతులకే అందేలా చూడాలని వారు సూచించారు. అధికారుల సూచనలన్నీ దస్త్రంలో సీఎం కేసీఆర్‌కు నివేదించి.. ముఖ్యమంత్రి ఇచ్చే సూచనల ప్రకారం ఈ పథకం అమలుకు అధికారికంగా మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీకానున్నాయి. వాటి ప్రకారం అర్హులైన అన్నదాతల పేర్లతో చెక్కులు ముద్రించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

బంగారు రుణం మాటేమిటీ...

కర్షకులు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకునేవారు. గత అక్టోబరు నుంచి బంగారంపై తీసుకునేవాటిని ‘పంటరుణం’ పేరుతో చూపవద్దని రిజర్వుబ్యాంకు... బ్యాంకులను ఆదేశించింది. రుణమాఫీ పథకం కింద 2018 డిసెంబరు 11 నాటికి పంటరుణం తీసుకున్నవారంతా అర్హులని ప్రభుత్వం తెలిపింది. అప్పుడు బంగారంపై రుణాలు కూడా పంటరుణం జాబితాలో ఉన్నాయి. కానీ ఆ తరువాత రిజర్వుబ్యాంకు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని మాఫీ జాబితా నుంచి బంగారంపై రుణాలను తొలగించాలా లేక ఉంచాలా అని సీఎంను అడగాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

ఇవీ చూడండి: తెలంగాణలో కరోనా లేదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.