అబ్కారీ శాఖలో సాంకేతిక కారణాల దృష్ఠ్యా... కొత్తగా సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికై శిక్షణ పొందుతున్న వారికి నాలుగు నెలలుగా వేతనం అందడం లేదు. డైరెక్ట్ రిక్రూట్లకు కేటాయించిన పోస్టుల్లోనూ.. సీనియారిటీ కింద భర్తీ చేయడంతో సమస్య తలెత్తింది. అబ్కారీ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది. ఖాళీ పోస్టుల్లో 50 శాతం డైరెక్ట్ రిక్రూట్లకు... మరో 50 శాతంలో సగం హెడ్ కానిస్టేబుళ్లకు, మరో సగం జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తారు.
డైరెక్ట్ రిక్రూట్..
రాష్ట్రంలో 135 అబ్కారీ పోలీసు స్టేషన్ల పరిధిలో 280 మందిని డైరెక్ట్ రిక్రూట్ ఎస్‌ఐలను ఎంపిక చేశారు. వీరికి నాలుగు నెలల శిక్షణ ఉంటుంది. మూణ్నేళ్లు అకాడమీలో, మరో నెల స్టేషన్లకు అనుసంధానం చేసి వివిధ హోదాల్లో శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన 280 మందికి.. కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా 45 రోజులు మాత్రమే అకాడమీలో శిక్షణ ఇచ్చి... స్టేషన్లకు ఫీల్డ్ ట్రైనింగ్‌కు పంపించారు. శిక్షణ మొదలైన ఫిబ్రవరి నుంచి వీరికి వేతనం రావాల్సి ఉంది. కానీ... శిక్షణలో ఉన్న 280 మందికి తగినన్ని పోస్టులు ఖాళీగా లేకపోవడం వల్ల సాంకేతికంగా సమస్యల తలెత్తి వేతనాలు చెల్లించలేదు.
50 శాతం పోస్టులు మాత్రమే
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు.. అందులో 50 శాతం పోస్టులు మాత్రమే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఒకవేళ ఎక్కడైనా పాలనాపరంగా ఇబ్బందులు ఉంటే.. 50 శాతానికి మించి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. అలా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చే సమయంలోనే... డైరెక్ట్ రిక్రూట్లు వస్తే పదోన్నతి వదులుకుని తిరిగి మ స్థానానికి వెళ్లాలని స్పష్టం చేస్తారు. ష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్లకు కేటాయించిన 80 పోస్టుల్లో 70 పోస్టులను సీనియార్టీ కింద పదోన్నతులు ఇచ్చి భర్తీ చేశారు.
పోస్టింగ్‌లు ఇవ్వాలంటే
క్షేత్ర స్థాయిలో డైరెక్ట్ రిక్రూట్లకు కేటాయించిన పోస్టుల్లో 210 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 70 పోస్టుల్లో సీనియరిటీ ఆధారంగా పదోన్నతులు పొందిన వారున్నారు. ఇప్పుడు శిక్షణ చేసుకుని వచ్చే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ఈ 70 మందిని తిరిగి దిగువ స్థాయికి పంపాల్సి ఉంది. కానీ చాలా కాలంగా ఎస్‌ఐలుగా పనిచేస్తున్న వీరు తమను అలాగే కొనసాగించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ తరుణంలో డైరెక్ట్ రిక్రూట్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ ఇబ్బందులను అధికమించేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించక తప్పడం లేదు. కానీ ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉంది. కరోనా దృష్ట్యా కార్యాలయాలకు రాలేని పరిస్థితులు ఏర్పడడం వల్ల ఆ పని పెండింగ్ పడింది. ఇప్పుడు ఈ సూపర్ మెమోరరీ పోస్టులు సృష్టించడంపై అబ్కారీ శాఖ దృష్టి సారించింది.
లాక్‌డౌన్ దృష్ట్యా శిక్షణలో అంతరాయం ఏర్పడిన మరో 45 రోజులు వారికి శిక్షణ ఇచ్చి పోస్టింగ్‌లు ఇస్తామని... ఆ లోపు ఈ సాంకేతికంగా ఉత్పన్నమైన సమస్యను పరిష్కారం చేసి వేతనాలు చెల్లిస్తామని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి : 'ఐపీఎస్‌లు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు'