ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు డిమాండ్ చేశారు. ఈ విషయమై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా... మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంపై గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై గానీ అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకోమన్నారు. జగ్గారెడ్డి భాష మార్చుకోకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామని గంధం రాములు హెచ్చరించారు.
ఇదీ చూడండి: రైతు బంధు కాదు... ఎన్నికల బంధు