Telangana Political Leaders Casted Vote 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులంతా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడ బర్కత్‌పురా దీక్ష మోడల్ స్కూల్లో తన కుటుంబంతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
-
Voted along with my family at Deeksha Model High School, Kachiguda earlier this morning for a stronger, more prosperous and aspirational Telangana.
— G Kishan Reddy (@kishanreddybjp) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Voting is our constitutional right and all of us must exercise it in the interest of an able administration. pic.twitter.com/18DhGUCy7t
">Voted along with my family at Deeksha Model High School, Kachiguda earlier this morning for a stronger, more prosperous and aspirational Telangana.
— G Kishan Reddy (@kishanreddybjp) November 30, 2023
Voting is our constitutional right and all of us must exercise it in the interest of an able administration. pic.twitter.com/18DhGUCy7tVoted along with my family at Deeksha Model High School, Kachiguda earlier this morning for a stronger, more prosperous and aspirational Telangana.
— G Kishan Reddy (@kishanreddybjp) November 30, 2023
Voting is our constitutional right and all of us must exercise it in the interest of an able administration. pic.twitter.com/18DhGUCy7t
Telangana MPs Casted Vote in Telangana : మరోవైపు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బాన్సువాడ మండలంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో .. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జ్యోతినగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కుటుంబసమేతంగా వచ్చి ఓటు వేశారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
Participated in the festival of democracy and exercised my Right to Vote along with my family at Booth No. 174, Jyothinagar, Karimnagar.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Urge everyone to participate as every vote counts#TelanganaElections2023 pic.twitter.com/tEkXyAiT7A
">Participated in the festival of democracy and exercised my Right to Vote along with my family at Booth No. 174, Jyothinagar, Karimnagar.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 30, 2023
Urge everyone to participate as every vote counts#TelanganaElections2023 pic.twitter.com/tEkXyAiT7AParticipated in the festival of democracy and exercised my Right to Vote along with my family at Booth No. 174, Jyothinagar, Karimnagar.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 30, 2023
Urge everyone to participate as every vote counts#TelanganaElections2023 pic.twitter.com/tEkXyAiT7A
హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ సొసైటీ కమ్యూనిటీ హాలులో ఉన్న పోలింగ్ బూత్ నంబర్ తొమ్మిదిలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆయన సతీమణి ఉమా కుమారుడు రాహుల్ కుమార్తె శృతి లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
KTR Casted Vote in Hyderabad : బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లో తన భార్యతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓ పౌరుడిగా తన బాధ్యత నిర్వహించానని.. విద్యావంతులంతా వారి బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలని కోరారు. అభివృద్ధికి బాటలు వేసే నాయకులకే తాను ఓటు వేశానని తెలిపారు. సిద్దిపేట భారత్‌నగర్ అంబిటస్ స్కూల్లో మంత్రి హరీశ్‌రావు సతీసమేతంగా ఓటు వేశారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల తంటాలు - పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్న అభ్యర్థులు
Telangana Ministers Cast Votes : సూర్యాపేటలోని శ్రీ చైతన్య పాఠశాలలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటు వేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి.. బోయిన్‌పల్లిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
దేశ రక్షణ కోసం బార్డర్ లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు....
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి.
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం
అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి.
I have casted my vote! My request… pic.twitter.com/sV2foHFNUs
">దేశ రక్షణ కోసం బార్డర్ లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు....
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2023
కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి.
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం
అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి.
I have casted my vote! My request… pic.twitter.com/sV2foHFNUsదేశ రక్షణ కోసం బార్డర్ లో సైనికులు బయటి నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు....
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2023
కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి.
మనతో పాటె మన పిల్లల భవిష్యత్ కోసం కాసేపు లైన్ ఉన్నా భరిద్దాం
అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి.
I have casted my vote! My request… pic.twitter.com/sV2foHFNUs
MLC Kavitha Casted Vote in Hyderabad : బంజారాహిల్స్‌లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆమె ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి పురపాలికలలోని ప్రభుత్వ పాఠశాలలో చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అడుగడుగునా పోలీసుల నిఘా - లక్షమంది బలగంతో పటిష్ఠ బందోబస్తు
నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్ గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నారాయణపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ .. దుబ్బాక నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు స్వగ్రామమైన అక్బర్ పేట - భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో ఓటు వేశారు. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి శీరిష (బర్రెలక్క) ఓటు వేశారు.
వికలాంగుల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు : శైలజ
ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసేయ్ - ఓటింగ్ శాతాన్ని పెంచేయ్