మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై(DRUNK AND DRIVE ) పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిని న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. జులై నెల నుంచి ఆగస్టు 20 వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 2,056 మంది... మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
ఇందుకు సంబంధించి మొత్తం 1,670 చార్జ్‌షీట్‌లు నమోదు చేశారు. ముగ్గురు మందుబాబులను కోర్టు వేళలు ముగిసే వరకు నిలబడి ఉండాలని న్యాయస్థానం శిక్ష విధించింది. మరొకరి డ్రైవింగ్ లైసెన్స్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కోర్టు... రూ.1,74,50,000 జరిమానాలు విధించింది. చిత్తుగా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం జరిగితే బీమా రాదు..
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైతే భారత బీమా రెగ్యులేటరీ, అభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం బీమా వర్తించదని ట్రాఫిక్ కమిషనర్ ఎస్.అనిల్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: Inhuman Incident: పొత్తిళ్లలో అదుముకోవాల్సిన తల్లే.. పసికందును పారేయాలనుకుంది!