ETV Bharat / state

KTR Tweet Today : 'కుమురంభీం కల సాకారమైన వేళ.. గిరిజనులకు పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిది'

Telangana Podu Pattas Distribution : నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే ఉద్యమ నినాదాలను సాకారం చేయడమే కాకుండా.. కుమురంభీం కలలుగన్న జల్..జంగల్..జమీన్ కలను కూడా అక్షరాలా నిజం చేసిన ధీరోదాత్తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నేడు గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్న తరుణంలో కేటీఆర్​తో పాటు.. మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. అడవి బిడ్డల అభ్యున్నతిలోనే నేడు ఓ సువర్ణ అధ్యాయమని.. గిరిపుత్రులకు యజమానులుగా చేస్తున్న చారిత్రక సందర్భం ఇది అని మంత్రులు పేర్కొన్నారు.

ministers
ministers
author img

By

Published : Jun 30, 2023, 2:02 PM IST

Podu Pattas Distribution Telangana : రాష్ట్ర సర్కార్ ఎన్నో ఏళ్ల గిరిజనుల గోసకు నేడు చెక్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిపుత్రులకు పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15వేల మందికి పైగా పోడు రైతులకు.. నాలుగు లక్షల ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ అందజేస్తోంది. అడవి బిడ్డల అభ్యున్నతిలోనే నేడు ఓ సువర్ణ అధ్యాయమని.. గిరిపుత్రులకు యజమానులుగా చేస్తున్న చారిత్రక సందర్భం అంటూ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ట్విటర్ వేదికగా పోస్టు పెట్టారు.

  • నీళ్ళు..
    నిధులు..
    నియామకాలు..
    అనే ఉద్యమ నినాదాలనే కాదు..

    జల్..
    జంగల్..
    జమీన్...
    అనే కుమ్రం భీం కలలను కూడా..

    అక్షరాలా..
    సాకారం చేసిన..
    ధీరోదాత్తమైన నాయకుడు..
    మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు...

    మొన్న
    కొండకోనల్లోని నివాసాలకు
    మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్"

    నిన్న
    కంటికి రెప్పలా… pic.twitter.com/WZOZQrTDUf

    — KTR (@KTRBRS) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet on Podu Pattas Distribution : నీళ్లు, నిధులు.. నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాకుండా.. జల్.. జంగల్.. జమీన్.. అనే కుమురం భీం కలలను కూడా.. అక్షరాలా సాకారం చేసిన.. ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్" అందించామని.. నిన్న కంటికి రెప్పలా అడవులను కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం "జంగల్" పెరిగిందని.. నేడు 1.51 లక్షల మందికి.. ఏకంగా 4.60 లక్షల ఎకరాల "జమీన్" పై హక్కును కల్పిస్తూ పట్టాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

'మావ నాటే - మావ రాజ్' స్వప్నం గ్రామ పంచాయతీల ఏర్పాటుతో సాకారమైందని కేటీఆర్ తెలిపారు. మరోవైపు పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆకాశాన్నంటే ఆత్మ విశ్వాసం పెరిగిందని చెప్పారు. ఇలా ఒకటా, రెండా.. పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన - ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి.. పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అభివర్ణించారు. అడవి బిడ్డల అభ్యున్నతిలోనే ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, గిరిపుత్రులకు భూ పట్టాలు అందించి వారిని యజమానులుగా చేస్తున్న చారిత్రక సందర్భం నేడు. గిరిజన జాతి చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందిస్తూ, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తుండటం గొప్ప విషయం.… pic.twitter.com/iydTnSDxVo

    — Harish Rao Thanneeru (@BRSHarish) June 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harish Rao Tweet on Podu Pattas Distribution : దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. గిరిపుత్రులకు భూ పట్టాలు అందించి వారిని యజమానులుగా చేస్తున్న చారిత్రక సందర్భం నేడు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గిరిజన జాతి చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యయనమని వివరించారు. 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందిస్తూ.. రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తుండటం గొప్ప విషయమని తెలిపారు. కుమురం భీం 'జల్-జంగిల్-జమీన్' నినాదానికి సార్థకత చేకూర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల గుండెల్లో పదిలంగా ఉంటారని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

మరోవైపు పోడు పట్టాల పంపిణీతో పాటే అటవీ భూముల అన్యాక్రాంతాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్.. కమతాల చుట్టూ ఉన్న అటవీ భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగించనుంది. భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక నుంచి పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత.. ఇకపై అంగుళం భూమి ఆక్రమణలకు గురి కాకుండా పక్కాగా చర్యలు తీసుకునేలా కార్యాచరణ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.