ETV Bharat / state

జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్​ ఎదుట తెరాస ఎంపీల ధర్నా - telangana pms protest for gst arrears in gandhi statue at parliament

జీఎస్టీ నష్టపరిహరం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ... పార్లమెంట్ భవనం ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీల ధర్నా చేపట్టారు. రాష్ట్రానికి రూ.9 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని తెరాస లోక్​సభ పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

telangana-pms-protest-for-gst-arrears-in-gandhi-statue-at-parliament
జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్​ ఎదుట తెరాస ఎంపీల ధర్నా
author img

By

Published : Sep 17, 2020, 7:25 PM IST

రాష్ట్రానికి జీఎస్టీ నష్టపరిహారం చెల్లించాలంటూ పార్లమెంట్ భవనం ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు ధర్నా చేపట్టారు. రూ.9 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని తెరాస లోక్​సభ పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని.. ఆదుకోవాల్సింది పోయి ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని నామ విమర్శించారు.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడుతామన్నారు. సమస్యల ప్రస్ధావనకు సభలో సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి, సమన్వయం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని నామ అన్నారు

ఇదీ చూడండి: జీఎస్​టీ బకాయిల కోసం విపక్షాల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.