రాష్ట్రంలో రూ.300 కోట్లతో టెక్నాలజీ, ఎక్స్టెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్లో వినోద్ సమావేశం నిర్వహించారు. కృత్రిమ మేథ, రోబోటిక్స్, నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరంలో టెక్నాలజీ కేంద్రం, కరీంనగర్ శివారులో ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనూ ఎక్స్టెన్షన్ కేంద్రాలు స్థాపించేలా చర్యలు తీసుకోవాలని పాలనాధికారులకు ఆదేశించారు.
ఇవీచూడండి: 'ప్రభుత్వం స్పందించేలా గవర్నరే చొరవ చూపాలి'