డిగ్రీ, పీజీ విద్యార్థులను కుడా పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల మాదిరిగా పరీక్షలు లేకుండానే అంతర్గత మార్కుల ఆధారంగా పాస్ చేయాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తల్లిదండ్రులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విన్నవించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, పీజీ విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి అంతర్గత మార్కులకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించిందని, అదే విధంగా తెలంగాణలో కూడా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ వెసులుబాటు కల్పించాలని మంత్రిని కోరారు.
తెలంగాణలో కూడా డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు బీటెక్ పరీక్షలు రద్దుచేసి అంతర్గత మార్కులతో గ్రేడింగ్ ఇచ్చి.. ఫలితాలు ప్రకటించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య కోరారు. కొంతమంది విద్యార్థులకు పెండింగులో ఉన్న బ్యాక్లాగ్ సబ్జెక్టులను కూడా పాసయ్యే విధంగా ఫలితాలు ప్రకటించాలన్నారు. దీంతో డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలకు లేదా ఉద్యోగాన్వేషణకు అవకాశం కల్పించి, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కల్గించాలని కోరారు. లేఖ ప్రతిని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు పంపినట్లు తల్లిదండ్రుల సంఘం తెలిపింది.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం