ETV Bharat / state

Traffic Restrictions: సచివాలయం ప్రారంభోత్సవం వేళ.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ సైతం మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

Traffic
Traffic
author img

By

Published : Apr 28, 2023, 10:06 PM IST

Traffic Restrictions in Hyderabad:రాష్ట్ర నూతన సచివాలయం భవనాన్ని ఈనెల 30తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అటువైపు వచ్చే వాహనాదారులు పోలీసులు సూచించిన మార్గంలో వెళ్లాలని కోరారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఏఏ మార్గాల్లో: ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ సైతం మూసివేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్.టి.ఆర్ మార్గం, తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతించనున్నామని పేర్కొన్నారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. చింతల్‌ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతించనున్నామని వివరించారు.

Traffic Restrictions In Hyderabad: ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్, అంబేడ్కర్​ విగ్రహం, ట్యాంక్‌ బండ్ వైపు అనుమతిస్తారు. కట్ట మైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పై నుంచి అనుమతిస్తారు. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను అనుమతిస్తామని వివరించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వాహనాలు మళ్లించబడవని వెల్లడించారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ మార్గం నుంచి వచ్చే వాహనాలను ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్.. బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు వివరంగా చెప్పారు. వాహనదారులు ఈ మార్గాలలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.

సుందరంగా నూతన సచివాలయం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ శ్వేత సౌదంలాగా విరజిల్లుతుంటే.. దాని సోయగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున హైదరాబాద్‌ నగరవాసులను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల 30న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది. రాత్రి సమయంలో కాంతు లీనుతూ ఎంతో ఆకర్షణగా సచివాలయం నిలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.