ETV Bharat / state

సిద్ధమవుతున్న కొత్త సచివాలయ నమూనాలు

సచివాలయ నమూనాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ ఆర్కిటెక్ట్​ల నుంచి వచ్చిన నమూనాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే నాలుగైదు నమూనాలను పరిశీలించగా... మిగతా వాటిని కూడా పరిశీలించి ముఖ్యమంత్రి ముందు ఉంచనున్నారు. అటు సచివాలయ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

telangana secretariat
author img

By

Published : Sep 14, 2019, 8:34 PM IST

సిద్ధమవుతున్న కొత్త సచివాలయ నమూనాలు

సచివాలయ కార్యాలయల తరలింపు ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అన్ని శాఖలను ఇప్పటికే తరలించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖల దస్త్రాల తరలింపు ప్రక్రియ తుది దశలో ఉంది. సోమవారం నుంచి ఆ శాఖల కార్యకలాపాలు కూడా బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్కే భవన్​లో మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు అంతస్తులను మినహా మిగతా అన్ని అంతస్తుల్లోనూ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత డీ, సీ బ్లాక్​లో ఉన్న సర్వర్లు సహా మిగతా అన్నింటిని కూడా బూర్గుల భవన్​కు తరలించనున్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే కూల్చివేతపై ఆర్ అండ్ బీ శాఖ దృష్టి సారించనుంది. మరోవైపు సచివాలయ నమూనాలకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు

కొత్త సచివాలయ నిర్మాణం కోసం నమూనాలు పంపాల్సిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా పేరున్న 15 ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు రాశారు. అందులో తొమ్మిది కంపెనీలు తమ నమూనాలను పంపాయి. ముంబయికి చెందిన హఫీజ్, చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ సహా ఇతరులు ఇందులో ఉన్నారు. ఆయా కంపెనీలు పంపిన నమూనాల్లో నాలుగు, ఐదు నమూనాలకు సంబంధించి అధికారులు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మిగతా వాటిని కూడా పరిశీలించాల్సి ఉంది. అన్ని నమూనాలను పూర్తి స్థాయిలో పరిశీలించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉంచనున్నారు. సచివాలయ నిర్మాణానికి అవసరమైన నమూనాను సీఎం ఖరారు చేస్తారు.

వాస్తు నిపుణుల సూచనలు

సచివాలయ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ కార్యాలయ స్థలాన్ని కూడా వినియోగించుకోనున్నారు. కొత్త భవనాల నిర్మాణం కోసం స్థలం చతురస్రాకారం లేదా ధీర్ఘచతురస్రాకారంలో ఉండాలని వాస్తు నిపుణులు సూచించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు సచివాలయ ప్రవేశ ద్వారాన్ని ఆనుకొని పురాతన రాతికట్టడంతో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం ఉంది. దాన్ని తొలగిస్తేనే చతురస్ర లేదా ధీర్ఘచతురస్రాకారంలో స్థలం ఉంటుంది. అందువల్ల ఆ భవనాన్ని కూడా తొలగించి... ఈ స్థలాన్ని సచివాలయ ప్రాంగణంలో కలుపుతారు. కూల్చివేతలన్నీ పూర్తయ్యాక మొత్తం స్థలాన్ని పూర్తి స్థాయిలో చదును చేశాక కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇవీ చూడండి: లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా

File : TG_Hyd_67_14_New_Secretariat_Pkg_3053262 From : Raghu Vardhan ( ) సచివాలయ నమూనాలు ఖరారు చేసే పనిలో ప్రభుత్వం పడింది. వివిధ ఆర్కిటెక్ట్ ల నుంచి వచ్చిన నమూనాలను సర్కార్ దశల వారీగా పరిశీలిస్తోంది. ఇప్పటికే నాలుగైదు నమూనాలను పరిశీలించగా... మిగతా నమూనాలను కూడా పరిశీలించి ముఖ్యమంత్రి ముందు ఉంచనున్నారు. అటు సచివాలయ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి...లుక్ వాయిస్ ఓవర్ - సచివాలయ కార్యాలాయల తరలింపు ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకొంది. దాదాపుగా అన్ని శాఖల కార్యాలయాలు ఇప్పటికే తరలించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యాలయాల తరలింపు ప్రక్రియ తుదిదశలో ఉంది. సోమవారం నుంచి ఆ శాఖల కార్యకలాపాలు కూడా బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీఆర్కే భవన్ లో మరమ్మత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు అంతస్థులను మినహాయిస్తే మిగతా అన్ని అంతస్థుల్లోనూ మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి. మరమ్మత్తులు పూర్తయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత డీ, సీ బ్లాక్ లో ఉన్న సర్వర్లు సహా మిగతా అన్నింటిని కూడా బూర్గుల భవన్ కు తరలించనున్నారు. తరలింపు ప్రక్రియ సంపూర్ణం అయ్యాక కూల్చివేతపై ఆర్ అండ్ బీ శాఖ దృష్టి సారించనుంది. మరోవైపు సచివాలయ నమూనాలకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. కొత్త సచివాలయ నిర్మాణం కోసం నమూనాలు పంపాల్సిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా పేరెన్నికగల 15 ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు రాశారు. అందులో తొమ్మిది కంపెనీలు తమ నమూనాలను పంపాయి. ముంబయికి చెందిన హఫీజ్ కంట్రాక్టర్ సహా చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ సహా ఇతరులు ఇందులో ఉన్నారు. ఆయా కంపెనీలు పంపిన నమూనాల్లో నాలుగు, ఐదు నమూనాలకు సంబంధించి అధికారులు ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజెంటేషన్ ఇచ్చారు. మిగతా వాటిని కూడా పరిశీలించాల్సి ఉంది. అన్ని నమూనాలను పూర్తి స్థాయిలో పరిశీలించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉంచనున్నారు. సచివాలయ నిర్మాణానికి అవసరమైన నమూనాను సీఎం ఖరారు చేస్తారు. అటు సచివాలయ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ కార్యాలయ స్థలాన్ని కూడా వినియోగించుకోనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం స్థలం చతురస్రాకారం లేదా ధీర్ఘచతురస్రాకారంలో ఉండాలని వాస్తు నిపుణులు సూచించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు సచివాలయ ప్రవేశద్వారాన్ని ఆనుకొని పురాతన రాతికట్టడంతో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం ఉంది. దాన్ని తొలగిస్తేనే చతురస్ర లేదా ధీర్ఘచతురస్రాకారంలో స్థలం ఉంటుంది. దీంతో ఆ భవనాన్ని కూడా తొలగించి ఆ స్థలాన్ని కూడా సచివాలయ ప్రాంగణంలో కలుపుతారు. కూల్చివేతలన్నీ పూర్తయ్యాక మొత్తం స్థలాన్ని పూర్తి స్థాయిలో చదును చేశాక కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.