ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకుంటుంది: బండి సంజయ్

కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరిని దిల్లీలో కలిశారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విన్నవించుకున్నారు.

ఆర్టీసీ కార్మికులకు భాజపా అండగా ఉంటుంది: బండి సంజయ్​
author img

By

Published : Nov 21, 2019, 4:50 PM IST

ఆర్టీసీ కార్మికులకు భాజపా అండగా ఉంటుంది: బండి సంజయ్​

ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సమ్మె విషయంలో కేంద్రం తప్పకుండా జోక్యం చేసుకుంటుందని.. కార్మికులకు న్యాయం జరిగే వరకు భాజపా అండగా ఉంటుందన్నారు. ఇది కార్మికుల విజయంగా ఆయన అభివర్ణించారు. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్​ కన్న బిడ్డలుగా భావించి చర్చలకు ఆహ్వానించాలని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా వారిని విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. వారికి జీతాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

కార్మికుల మనోగతాన్ని తెలుసుకునేందుకు మరోసారి చర్చలు జరిపి అశ్వత్థామ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్​, సోయం బాపూరావు, అర్వింద్​ కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీలు పేర్కొన్నారు.

హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.