Telangana Ministers: ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వ బృందం... ఇవాళ కేంద్రంతో మారోమారు చర్చలు జరపనుంది. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, అధికారుల బృందం... సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో సమావేశం కానుంది. మూడు రోజుల క్రితం కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్ర బృందం... ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటికే సాగైన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంపై ముందుగానే స్పష్టతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. బాయిల్డ్ రైస్‌ను కొనబోమని మరోసారి ఖరాఖండిగా తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం... మామూలు బియ్యాన్ని ఎంతకొంటామనే విషయాన్ని ఈనెల 26న స్పష్టం చేస్తామని తెలిపింది.
మరోమారు సమావేశం...
ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరింతగా పెంచుతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రులు... 26న మరింత స్పష్టతతో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర బృందం ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మరోమారు సమావేశం కానుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులు ఈ ఉదయం హస్తిన బయల్దేరి వెళ్లనున్నారు.
ఇదీ చూడండి: