ETV Bharat / state

World Water Day: 'నీటి వినియోగం, పొదుపులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ' - minister wishes on world water day

Minister Wishes On World Water Day: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పలు సూచనలు చేశారు. నీటిని పొదుపుగా వాడి.. భవిష్యత్ తరాలకు అందించాలని ట్విట్టర్ వేదికగా సూచించారు. నీటి పొదుపులో తెలంగాణ అమలు చేస్తున్న వ్యూహాలు.. మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా ఉందన్నారు.

world water day 2022
ప్రపంచ జల దినోత్సవం
author img

By

Published : Mar 22, 2022, 6:51 PM IST

Minister Wishes On World Water Day: ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడి భవిష్యత్ తరాలకు అందించాలని మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు మంత్రులు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో సాకారమైన కాళేశ్వరం, మిషన్ కాకతీయను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్​ అన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన ముఖ చిత్రాన్ని మార్చాయని పేర్కొన్నారు. సీఎం అందించిన సాగునీటి ఫలాలను వినియోగించుకోవాలని.. అందరూ నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని కోరారు.

  • This #WorldWaterDay, we the people of Telangana celebrate CM KCR’s glorious flagship projects - Kaleshwaram Project and Mission Kakatiya.

    These projects have changed the course of lives in Telangana, I request more and more people to make a shift to water harvesting practices. pic.twitter.com/fczYmK2DIL

    — Harish Rao Thanneeru (@trsharish) March 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రతి ఒక్కరూ నీటి విలువ తెలుసుకొని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పారు. నీటిని ఒడిసిప‌ట్టడం, వినియోగం, పొదుపు చేయడంలో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం.. మిగ‌తా రాష్ట్రాల‌ు, కేంద్రానికి భిన్నంగా ఉందన్నారు.

  • నేడు ప్రపంచ జల దినోత్సవం.

    ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం...
    భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం#WorldWaterDay pic.twitter.com/jwKp7dYOGG

    — Errabelli DayakarRao (@DayakarRao2019) March 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు 4.35 మీటర్ల మేర పెరిగాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గూడేలు, తండాలకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన, స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవ‌న్నీ దేశానికే ఆద‌ర్శంగా, దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఎనిమిదేళ్లైనా పైసా ఇయ్యలే... ఆదుకోండి సార్లూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.