ETV Bharat / state

'గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది' - telangana news

KTR express deep Condolences : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై తెలంగాణ మంత్రులు, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్‌ రెడ్డి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

KTR express deep Condolences, ap ministers goutham reddy no more
గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: కేటీఆర్‌
author img

By

Published : Feb 21, 2022, 2:29 PM IST

Updated : Feb 21, 2022, 2:50 PM IST

గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: కేటీఆర్‌

KTR express deep Condolences : ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్‌ రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. గౌతమ్‌ రెడ్డి అకాల మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. ఉజ్వల భవిష్యత్తున్న నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గౌతమ్‌తో 12 ఏళ్లుగా ఉన్న పరిచయాన్ని కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

గౌతమ్‌రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. గౌతమ్‌రెడ్డితో నాకు 12 ఏళ్లుగా పరిచయం ఉంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు గౌతమ్‌రెడ్డి. కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.

-కేటీఆర్, మంత్రి

Political leaders express deep Condolences : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. గౌతమ్‌ రెడ్డి మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సన్నిహితుడైన మేకపాటి మరణం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంతో నిబద్ధతతో పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. పిన్నవయసులోనే ఆయన చనిపోవడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గౌతమ్‌ రెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత మరణం కలచివేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అపోలో ఆస్పత్రిలో గౌతమ్‌ మృతదేహానికి పువ్వాడ అజయ్‌ నివాళులర్పించారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల సీపీఐ నారాయణ సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ మంత్రి కన్నుమూత

AP Minister Goutham reddy dies of heart attack : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని జూబ్లీహిల్స్​ అపోలో వైద్యులు ప్రకటించారు. ఉ.7.45 గం.కు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చారని వెల్లడించారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదన్నారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని.. గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు ఉదయం 9.16 గంటలకు అపోలో వైద్యులు ప్రకటించారు.

ఇదీ చదవండి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

Last Updated : Feb 21, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.