పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్ళమ్మ వారిని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. సమీపంలో జరిగిన కోడి పందేలను తిలకించారు. భీమవరం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు వచ్చి సంక్రాంతిని ఆనందంగా గడపడం మన సంస్కృతిలో భాగమని చెప్పారు. అమరావతి రైతుల్లో ఉన్న ఆవేదనను.. ముఖ్యమంత్రి పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రంధి శ్రీనివాస్.
ఇవీ చూడండి: