తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజానికి ఎత్తుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న ఆయన... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఊరు నిండా జాతీయ జెండా నినాదంతో పల్లెపల్లెలో త్రివర్ణ పతాకాల ఆవిష్కరించాలని సూచించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిగాయని గుర్తు చేశారు. జలియన్ వాలాబాగ్ ఉదంతాలను తలపించే రీతిలో పోరాటాలు జరిగాయని వివరించారు. రజాకార్లు ఆధునిక ఆయుధాలతో వస్తే బైరాన్‌పల్లి వాసులు తిప్పికొట్టారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ఆగడాలను పసిగట్టారని... నిజాం మెడలు వంచి ఈ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేశారని కొనియాడారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!